Slider Telangana

తెలంగాణకు కేంద్రం మరోసారి అన్యాయం

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పైసా కూడా కేటాయించకపోవడం అన్యాయం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. గత పదేండ్లలో కూడా బడ్జెట్ లో ఆశించిన నిధులను కేటాయించలేదు.. తాజాగా ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సైతం మరోసారి అన్యాయం చేశారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్న జేడీయూ టీడీపీ పాలిత రాష్ట్రాలైన బీహార్ ,ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు కేటాయించడం […]Read More

Business Slider

తగ్గిన బంగారం వెండి ధరలు

కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో వెండి బంగారం ప్లాటీనం పై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. బంగారం,వెండిపై ఆరుశాతం,ప్లాటీనం పై ఆరున్నర శాతం కస్టమ్ తగ్గిస్తున్నట్లు బీజేపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో బంగారం పై నాలుగు వేలు తగ్గి అరవైఎనిమిది వేల ఐదోందలుగా నిలిచింది. వెండిపై నాలుగు వేల ముప్పై ఏడు రూపాయలు తగ్గి ఎనబై ఎనిమిది వేలకు చేరింది. కేంద్ర బడ్జెట్ ఎఫెక్టుతో బంగారం సిల్వర్ ధరలు తగ్గడం విశేషం.Read More

Slider Telangana

బీఆర్ఎస్ఎల్పీ భేటీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఢుమ్మా..?

బీఆర్ఎస్ అధినేత… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ భేటీకి ఆరుగురు ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎమ్మెల్సీలు ఢుమ్మా కొట్టారు. రేపటి నుండి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ దళపతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలకు వివరించారు. ఈ క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు,సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీలు చల్లా,గోరటి తదితరులు […]Read More

National Slider

గ్రామీణ ప్రాంతాలపై మోడీ ఫోకస్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణానికి  రూ.2.66 లక్షల కోట్లు కేటాయించారు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా ఆర్థిక అవకాశాలూ దొరుకుతాయని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. పీఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండటమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అని తెలిపారు..Read More

National Slider

ఎన్డీఏ రాష్ట్రాలకు శుభవార్త

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వాలున్న ఏపీ,బిహార్లపై బడ్జెట్ 2024-25 నుంచి నిధుల వర్షం కురిసింది. ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులివ్వనుంది. మరోవైపు బిహార్లో రోడ్ల అభివృద్ధికి రూ.26వేల కోట్ల సాయంతో పాటు ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీల నిర్మాణాలు, స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చేయనుంది.Read More

National Slider

మొబైల్ యూజర్లకు శుభవార్త

మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడిసిన్, వైద్య పరికరాలను కస్టమ్స్ డ్యూటీ మినహాయిస్తున్నట్లు తెలిపారు. దీంతో మూడు రకాల క్యాన్సర్ నివారణ మందుల ధరలు తగ్గనున్నాయి. మరోవైపు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6శాతానికి, ప్లాటినం 6.5% తగ్గించారు.Read More

National Slider

ధరలు తగ్గేవి ఇవే..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే. అయితే ఈ బడ్జెట్ లో కింది వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో పలు వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. *మందులు, వైద్య పరికరాలు * మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు * సోలార్ ప్యానెళ్లు * దిగుమతి చేసుకునే బంగారం, వెండి, * సముద్ర ఆహారం, లెదర్, టెక్స్టైల్ (చెప్పులు, షూస్, దుస్తులు, బ్యాగులు) ధరలు తగ్గే అవకాశం […]Read More

Slider Telangana

ఈనెల 31వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల ముప్పై ఒకటో తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈరోజు ఉదయం మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సాయన్న కు నివాళులు అర్పించిన అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.. తదానంతరం జరిగిన బీఏసీ సమావేశంలో సభను ఎనిమిది రోజులు నడపాలని నిర్ణయించారు. ఎల్లుండి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశపెట్టనున్నారు.Read More

National Slider

కొత్త ఆదాయ పన్ను స్లాబ్స్ ఇవే

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ వార్షిక బడ్జెట్ లో ఆదాయ పన్ను స్లాబ్స్ గురించి మాట్లాడారు.. అవి ఇలా ఉన్నాయి… రూ.0-3 లక్షలు- నిల్ రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలు- 5% రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు- 10% రూ.10 లక్షల నుంచి 12 లక్షలు- 15% రూ.12 లక్షల నుంచి 15 లక్షలు- 20% రూ.15 లక్షలకు పైగా- 30%Read More

National Slider Telangana

తెలంగాణకు మరోసారి మొండి చేయి

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ 2024-25లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేమీ జరగలేదు. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్ లతో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించింది. రైలు మార్గాలు లేని జిల్లాలకు కొత్త ట్రాక్లు వస్తాయనే ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి ఎనిమిది స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టిన సంగతి కూడా తెల్సిందే. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులున్న కానీ […]Read More