కివీస్ తో జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఒక టెస్టు సిరీస్ లో అత్యల్ప పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్ గా రోహిత్ నిలిచారు. న్యూజిలాండ్ జరుగుతున్న సిరీస్ లో హిట్ మ్యాన్ 6 ఇన్నింగ్స్ లో కలిపి కేవలం 91 పరుగులే చేశారు. ఈ జాబితాలో రామ్ చంద్ (68-1959/60), అజిత్ వాడేకర్ (82-1974), పటౌడి (85-1974/75) తొలి 3 స్థానాల్లో ఉన్నారు. […]Read More
తెలంగాణ లో వచ్చే ఏడాది సంక్రాంతిలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో వెల్లడించారు. రాబోయే నాలుగేళ్లు ఎనుముల రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు..సీఎం మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కొందరు ప్రముఖ నాయకులు త్వరలో అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతారని మరొకసారి ఆయన చెప్పారు.Read More
ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఫీజు ఎంతో తెలుసా?… అక్షరాలా రూ.100 కోట్లు. అవును ఏదైనా రాష్ట్రంలో అక్కడి పార్టీకి సలహాలు ఇచ్చినందుకు రూ.వంద కోట్లు తీసుకుంటారని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. త్వరలో బిహార్లో త్వరలో ఉప ఎన్నికలు జరగనుండగా బెలగంజ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పది రాష్ట్రాల్లో తాను సలహాలు ఇచ్చిన ప్రభుత్వాలే గెలిచినట్లు తెలిపారు.Read More
కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒక తానుముక్కలేనా…?. గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో గిల్లిగిచ్చాలు పెట్టుకుంటాయా..?. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ హౌజ్ (లోక్ సభ) రాహుల్ గాంధీ నిత్యం లేస్తే మోదీ & టీమ్ పై విమర్శల బాణం ఎక్కుపెడతారు. తెలంగాణలో మాత్రం అదే పార్టీకి చెందిన నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఒక్క మాట కూడా అనరు.. అడగరు. కానీ అదే బీజేపీ కి చెందిన ఎంపీ.. కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి […]Read More
తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. తాజాగా ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెల ఐదో తారీఖు నుండి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆయన తెలిపారు. దాదాపు పదిహేను రోజుల్లో గ్రామ కమిటీల ద్వారా ఈ ఎంపికను పూర్తి చేస్తామన్నారు. ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి డిజైన్లు ఉండవు.. లబ్ధిదారుల […]Read More
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ రికార్డును నెలకొల్పారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో యాబై వికెట్లను పూర్తి చేసుకున్న రెండో భారత్ బౌలర్ గా చరిత్రకెక్కారు. మొదటి స్థానంలో రవిచంద్రన్ ఆశ్విన్ ఉన్నాడు. ఆశ్విన్ ఈ వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో మొత్తం అరవై రెండు వికెట్లను పడగొట్టాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు […]Read More
ముంబైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్ లో 147పరుగుల లక్ష్య చేధనకు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఐదు టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయి 29పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 11, యశ్వసీ జైశ్వాల్ 5,విరాట్ కోహ్లీ 1,శుభమన్ గిల్ 1,సర్ఫరజ్ ఖాన్ 1పరుగులకే ఔటవ్వడంతో ఎనిమిది ఓవర్లకు 31పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 116పరుగులు వెనకంజలో ఉంది.Read More
ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 235పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. దీంతో మొదటి ఇన్నింగ్స్ కు బరిలోకి దిగిన భారత్ మొత్తం వికెట్లను కోల్పోయి 263పరుగులు చేసింది. రోహిత్ సేనకు కేవలం ఇరవై ఎనిమిది పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ ముప్పై ఎనిమిది పరుగులతో రాణించాడు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఐదు […]Read More
కోరియో పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” నవంబర్ ఫస్ట్ తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు వరుస బెట్టి ఆరెస్ట్ అవుతారు. కాళేశ్వరం, ధరణి లాంటి మరెన్నో బాంబులు పేలతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి వెళ్లి రెండు రోజులవుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన బాంబులు ఏమి పేలలేదు. అవన్నీ వట్టి మాటలేనా అని ఇంట బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో […]Read More
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా బీసీ కులగణనలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ)లను మినహాయిస్తూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే కులగణనలో 36,549 మంది SGTలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ పాల్గోనున్నారు… కులగణనలో 6,256 MRCలు, 2వేల మంది మినిస్టీరియల్ సిబ్బంది సైతం పాల్గోనున్నారు. ఈనెల 6 నుంచి కులగణనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.Read More