Month: March 2025

Breaking News Slider Sports Top News Of Today

భారత్ లక్ష్యం ఎంతంటే..?

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో  న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 స్కోర్ చేసింది. కివీస్ ఆటగాళ్లల్లో మిచెల్ 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. వరుస విరామాల్లో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో కివీస్ జట్టు స్కోర్ చేసేందుకు కష్టాలు పడింది. భారత్ బౌలర్లల్లో వరుణ్, కుల్దీప్ తలో రెండు వికెట్లు, జడేజా, షమీ చెరో వికెట్ తీశారు. చివర్లో బ్రేస్వెల్(53) అర్ధ సెంచరీతో […]Read More

Breaking News Slider Sports Top News Of Today

నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్.!

టీమిండియా జట్టుతో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో నాలుగో వికెట్ ను కోల్పోయింది న్యూజిలాండ్. రవీంద్ర జడేజా బౌలింగ్ లో లేథమ్ ఎల్బీడబ్ల్యూ అవుటయ్యాడు. ముప్పై బంతులాడి లేథమ్ పద్నాలుగు పరుగులు చేశాడు.. ఇరవై నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లను కోల్పోయి 104పరుగులు చేసింది.భారత్ బౌలర్లలో కుల్దీప్ సింగ్ యాదవ్ రెండు ,వరుణ్ ఒకటి,జడేజా ఒక వికెట్లను తీశాడు..Read More

Breaking News Slider Sports Top News Of Today

21ఓవర్లకు కివీస్ 102 పరుగులు.!

ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో టీమిండియా టాస్ ఓడిన సంగతి తెల్సిందే.టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కివీస్ ఆచూతూచి ఆడుతుంది. ఇరవై ఒక్క ఓవర్లు పూర్తయి సరికే మూడు వికెట్లను కోల్పోయి 102పరుగులు సాధించింది . టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 2, వరుణ్‌ చక్రవర్తికి 1 వికెట్ పడింది. కివీస్ ఓపెనర్లు యంగ్ 15, రవీంద్ర 37, కేన్ విలియమన్స్  11పరుగులకు ఔటయ్యారు.. క్రీజులో  మిచెల్ 14* ,లథమ్ 18పరుగులతో ఉన్నారు..Read More

Breaking News Slider Sports Top News Of Today

దుమ్ము దులుపుతున్న కుల్దీప్ సింగ్ ..!

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ స్పిన్నర్ కుల్దీప్ సింగ్ యాదవ్ చెలరేగిపోయి ఆడుతున్నాడు..కుల్దీప్ సింగ్ యాదవ్ 1.2ఓవర్లు వేసి నాలుగు పరుగులిచ్చి రెండు వికెట్లను తీశాడు.. కివీస్ డేంజరస్ ఓపెనర్ రచిన్‌ రవీంద్ర (37)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. బౌలింగ్‌కు (10.1వ ఓవర్‌) వచ్చిన తొలి బంతికే రచిన్‌ను ఔట్ చేశాడు.. ఆ తర్వాత కేన్స్ విలియమన్స్ 11పరుగులకు క్యాచ్ అవుట్ చేశాడు..ఇప్పటివరకూ 13ఓవర్లకు మూడు వికెట్లను కోల్పోయి 77పరుగులు చేసింది.Read More

Breaking News Slider Sports Top News Of Today

రెండు వికెట్లను కోల్పోయిన కివీస్.

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు.. కివీస్ ఓపెనర్లైన యంగ్ (15) రవీంద్ర తొలివికెట్ కు 57పరుగులను జోడించగా యంగ్ పదిహేను పరుగులకు ఔటయ్యాడు. ఆతర్వాత రవీంద్ర 37పరుగులకు ఔటయ్యాడు.  సీనియర్ ఆటగాడు కేన్స్ విలియమన్స్ తొమ్మిది పరుగులతో క్రీజులో ఉన్నాడు.. పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లకు 67పరుగులు సాధించింది కివీస్.Read More

Breaking News Slider Sports Top News Of Today

ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాకి షాక్..!

దుబాయిలో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో భారత స్టార్ బౌలర్ షమీకి గాయమైంది. 7వ ఓవర్ వేస్తుండగా రచిన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోయాడు షమీ.. అది షమీ ఎడమ చేతికి తగిలి రక్తం వచ్చింది. చికిత్స అనంతరం షమీ ఓవర్ పూర్తి చేశారు. ఓవర్ ముగిసిన తర్వాత మైదానాన్ని వీడారు. ఇద్దరు పేసర్లు మాత్రమే ఉండటంతో షమీ కచ్చితంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గాయం పెద్దదైతే మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇప్పటికి […]Read More

Breaking News Slider Sports Top News Of Today

భారత్ బౌలింగ్..జట్టు ఇదే..!

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడింది..దీంతో  కివీస్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. గత మ్యాచులోని టీంతోనే బరిలోకి దిగనుంది. భారత జట్టు: రోహిత్(కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, అక్షర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమీ, కుల్దేప్, వరుణ్.Read More

Breaking News Slider Sports Top News Of Today

టాస్ ఓడిన టీమిండియా..!

ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో  జరుగుతున్న దుబాయ్ లో  ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో  న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో  ఇండియా తొలుత బౌలింగ్ చేయనుంది. భారత్ వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 15వ సారి కావడం గమనార్హం.Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ పై నెటిజన్లు అగ్రహాం..!

తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నెటిజన్లు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ తన ఎక్స్ లో ” తెలంగాణకు రావాల్సిన రూ.1700 కోట్ల సోలార్ ప్రాజెక్టును ఏపీ దక్కించుకోవడంపై చేసిన ట్వీట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ట్విట్టర్ లో కేటీఆర్ ‘మా పాలనలో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు తెలంగాణ కంటే గుజరాత్, తమిళనాడు ఆఖరుకు ఏపీని ఎంచుకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

హౌరా ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం..!

హౌరా ఎక్స్ ప్రెస్ కు ఘోరా ప్రమాదం తప్పింది..! తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ వద్ద హౌరా ఎక్అస్డ ప్రెస్ ప్రయాణిస్తున్న సమయంలో వయ్య కాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగింది. దీన్ని గమనించిన సునీల్ అనే వ్యక్తి రెడ్ క్లాత్ లోకోపైలట్ ను అప్రమత్తం చేశారు. దీంతో లోకో పైలట్ హౌరా రైలును ఆపేశారు. అనంతరం సంబధితాధికారులు ఆట్రాక్ మరమ్మతులు చేపట్టడంతో సుమారు గంటపాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయిRead More