తాను త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. ఓ ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. ‘మాఫియాను ఎదిరించి ఓ ఆడపిల్లకు పెళ్లి చేసే క్యారెక్టర్లో కనిపిస్తా. ఈ ఉగాదికి మూవీ స్క్రిప్ట్ వింటా. వచ్చే ఉగాదికి సినిమాను పూర్తి చేస్తాము. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిల అనుమతి తీసుకొని నటిస్తాను. ‘జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ను ఖరారు […]Read More
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ హాయాంలో గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రాపై అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో చర్చ జరిగింది.. ఈ చర్చలో ఆడుదాం .. ఆంధ్రా కార్యక్రమంలో ఎంత అవినీతి జరిగింది.. అసలు ఈ కార్యక్రమానికి వచ్చిన బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? రూ.119 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు.. 45 రోజుల్లో ఆడుదాం ఆంధ్రాపై నివేదిక ఇస్తాం, విజిలెన్స్ విచారణ జరుగుతోంది మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని అన్నారు. […]Read More
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పరిపాలనా దక్షత లేదు.తెలంగాణకు రేవంత్ గ్రహణంలా పట్టారు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నరు. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హారీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన అంతా 20:20 కమీషన్ పాలనలాగ నడుస్తుంది. తమకు పాలన చేతకాక ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ […]Read More
తెలంగాణలో మేం ఉద్యమకారులం.తెలంగాణ రాష్ట్ర సాధనకై కొట్లాడినం..ఎన్నో సార్లు జైళ్లకెళ్లినం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి అన్నారు.. టీవీ9 న్యూస్ ఛానెల్ తో మాట్లాడితూ పదవులను అడుక్కోవడానికి మేము ఏమి బిచ్చగాళ్లం కాదు. ఉద్యమకారిణిగా నాకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీ నన్ను ఆహ్వానించింది.కానీ ఆ రెండు పార్టీల మధ్యలో ఓ లోపాయికారి ఒప్పందం జరిగింది. అది తెల్సి నేనుఅందుకే బీజేపీ నుంచి బయటకు వచ్చాను..ఓ బీసీ మహిళా నేతగా […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పై జనగామ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు అందింది. గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై గెలుపొందిన యశస్విని రెడ్డి అధికారక నివాసమైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి మౌలిక వసతులు కానీ అధికారక కార్యక్రమాలు కానీ జరగడం లేదని స్థానికులు.. ప్రజలు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. ప్రజలకు అందుబాటులో […]Read More
భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. దుబాయిలోన్యూజీలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. 252 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. ఆఖర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా టీమ్ ఇండియాను గెలిపించారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ డెబ్బై ఆరు పరుగులకు స్టంపౌట్ అయ్యాడు.26.2 ఓవర్లకు టీమిండియా 122పరుగులు చేసింది. లక్ష్యానికి ఇంకా 130పరుగుల దూరంలో ఉంది. క్రీజులో అయ్యర్ 9*, అక్షర పటేల్ 0*లతో క్రీజులో ఉన్నారు.Read More
కివీస్ తో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా రెండో వికెట్ ను కోల్పోయింది. టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ రెండు పరుగులకే వెనుదిరిగాడు. ఇరవై ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లను 108పరుగులు సాధించింది. రోహిత్ శర్మ డెబ్బై పరుగులతో క్రీజులో ఉన్నాడు.Read More
టీమిండియా కెప్టెన్..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచురీ చేశాడు.. దుబాయి వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు ఫోర్లు..మూడు సిక్సర్ల సాయంతో నలబై ఒక్కబంతుల్లో యాబై పరుగులు సాధించాడు.. పదకొండు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ ఏమికోల్పోకుండా అరవై నాలుగు పరుగులు సాధించింది. మరోవైపు శుభమన్ గిల్ పదకొండు పరుగులతో క్రీజులో ఉన్నాడు.ఇంకా విజయానికి 135పరుగుల దూరంలో భారత్ ఉంది.Read More
ఈనెలలో ఎమ్మెల్యేకోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది.. ఇందుకుగానూ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలను ఖరారు చేసింది.. ఇప్పటికే ఓ సీటును సీపీఐకి ఇచ్చిన కాంగ్రెస్.. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్.. ఊహించని విధంగా తెరపైకి విజయశాంతి పేరు రావడం విశేషం.Read More