Month: March 2025

Breaking News Slider Telangana Top News Of Today

ఖ‌నిజాల మైన‌ర్ బ్లాక్‌ల వేలానికి వెంట‌నే టెండ‌ర్లు

ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమని చెప్పారు. గ‌నుల శాఖ‌పై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో ముఖ్య‌మంత్రి ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. గ‌త నెల రోజులుగా తీసుకున్న చ‌ర్య‌ల‌తో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ల్లో త‌వ్వ‌కాలు, ర‌వాణా, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏటీసీలు..!

తెలంగాణ రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్ (ITI) ను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు (ATC) గా తీర్చిదిద్దుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆరా తీశారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడేషన్ పనులపై ముఖ్యమంత్రి కార్మిక శాఖ ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో రూపుదిద్దుకుంటున్న ఏటీసీలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒకటి ఉండేలా చూడాల్సిందేనని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కొచ్చి విమానాశ్రయం తరహాలో మామునూరు విమానాశ్రయం..!

వరంగల్ మామునూరు విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతి నిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఎక అసెట్ గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశంలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తీన్మార్ మల్లన్న సస్పెండ్ – మున్నూరు కాపు నేతల భేటీ..!

తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మున్నూరు కాపు నేతల భేటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి. మాజీ ఎంపీ అయిన వీ హన్మంతరావు నివాసంలో మున్నూరు కాపు వర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గోన్నారు. ఈ భేటీ సందర్భంగా త్వరలోనే బల ప్రదర్శనకు సిద్ధమవ్వాలని మున్నూరు కాపు నేతలు నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో అన్యాయం జరిగిందని పలువురు మున్నూరు కాపు నేతలు తమ తమ అభిప్రాయాన్ని […]Read More

Breaking News Movies Slider Top News Of Today

తెలంగాణలోని మల్టీప్లెక్స్‌ థియేటర్లకు శుభవార్త..!

తెలంగాణలో మల్టీప్లెక్స్‌ థియేటర్లకు ఊరట లభించింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు మల్టీప్లెక్స్‌ థియేటర్లలో 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించకూడదని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ ఉత్తర్వులను సవరిస్తూ అన్ని మల్టీఫ్లెక్సీ థియేటర్లకు పదహారు ఏండ్ల లోపు పిల్లలను సైతం అన్ని షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గత జనవరి నెల 21న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. అయితే పదహారు ఏండ్ల లోపు పిల్లలను ప్రీమియర్, బెనిఫిట్, స్పెషల్ షోలకు […]Read More

Andhra Pradesh Breaking News Movies Slider Top News Of Today

పోసాని కృష్ణమురళి కి వైద్య పరీక్షలు..!

ప్రముఖ నటుడు నిర్మాత దర్శకుడు.. వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆంధ్రా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయుడుల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో కడప పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోసాని కృష్ణమురళికి కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలను డాక్టర్లు చేశారు. కడప జిల్లాలోని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి కౌంటరిచ్చారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ “సీఎం రేవంత్‌పై మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి సహనం, అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రంతో మాట్లాడుతున్నాను. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన నాలుగోందల ఇరవై హామీలతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ వైపల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే […]Read More

Breaking News International National Slider Top News Of Today

గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు శుభవార్త..!

గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించింది. 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణా రావును ఆదేశించినట్లు తెలంగాణ ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్బంగా అనిల్ ఈరవత్రి గల్ఫ్ ఎక్స్ గ్రేషియా విషయాన్ని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి చేసింది చెబితే చెవుల నుండే రక్తమే వస్తుందా..?

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెడును చెవిలో చెప్పాలి.. మంచిని మైకులో చెప్పాలి అని పెద్దలు చెబుతుంటారు. కానీ మన పార్టీ నేతలు.. కార్యకర్తలు మంత్రులు.. ఎమ్మెల్యే.. ఎంపీలు చెడునేమో మైకులో చెబుతున్నారు. మంచినేమో చెవిలో చెబుతున్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా రుణమాఫీ చేశాము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాము. ఐదోందలకే గ్యాస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మహిళలకు శుభవార్తను తెలిపింది. ఈ నెల ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కానుకగా ఎనిమిది పథకాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణలో మహిళాదినోత్సవం రోజు పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్నది ప్రభుత్వం. మొత్తం ఈనెల 8న పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నరు. రాష్ట్రంలో ఉన్న పలు మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను అందజేయనున్నారు. […]Read More