ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు.. ఆ పార్టీ సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి రాజీనామాపై పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తొలిసారి స్పందించారు. రాజీనామాపై జగన్ స్పందిస్తూ ‘మాకు 11 మంది రాజ్యసభఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా వైసీపీకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్ను బట్టే ఉంటుంది. వైసీపీ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నటనలో దివంగత మాజీ సీఎం.. ప్రఖ్యాత నటుడు ఎన్టీఆర్ ను మించిపోయారని వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విమర్శించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు పొరపాటున ఓటు వేసి చంద్రముఖిని నిద్రలేపారని అన్నారు. 9 నెలల పాలన తర్వాత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీగా మారిందని జగన్ బాబును దుయ్య బట్టారు. చీటింగ్ లో చంద్రబాబు పీహెచ్ఎ చేశారు.. చంద్రబాబును నమ్మడమంటే […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇందులో భాగంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతోన్న క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది. అటు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోనుంది అని మంత్రివర్గం నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను స్థానిక మంత్రులను […]Read More
స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!
మర్రి చెన్నారెడ్డి భవన్ లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం చేయాలి. అత్యధిక గ్రామ పంచాయితీలను ఏకగ్రీవం చేయాలి. గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన .. తాగునీటి వసతులు.. సీసీ బీటీ రోడ్ల నిర్మాణం..ఆలయ నిర్మాణాలను సహాకరించాలి. నిధుల కోసం స్థానిక సంబంధిత మంత్రులను కలవాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలి.. పార్టీ నేతలను.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని […]Read More
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే విజయవంతంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సామాజిక న్యాయం అమలుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే సమాచారాన్ని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు, సామాజిక పరంగా తీసుకునే నిర్ణయాలకు తప్పనిసరిగా వాడుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి […]Read More
చలికాలంలో మిగతా కాలాలతో పోలిస్తే సహాజంగా అందరికీ మూత్రం ఎక్కువగా వస్తుంది. పగలు సంగతి ఎలా ఉన్న కానీ రాత్రిళ్లు మూత్రం వచ్చినా నిద్రకి భంగం అవుతుందని చాలా మంది బద్ధకిస్తారు. ఇది ప్రమాదకరమని, బ్లాడర్ మీద ప్రెషర్ పెరిగి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మూత్రం ఎక్కువ సమయం ఆపితే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనమవుతాయని, కాలక్రమేణా మూత్రాశయం పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. మూత్రం రాగానే పాస్ చేయాలని సూచిస్తున్నారు.Read More
ఇంగ్లండ్ జట్టుతో రేపు గురువారం నుండి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. గత 14 వన్డేల్లో హిట్మ్యాన్ రికార్డ్ స్థాయిలో రన్స్ చేశారని, అందులో సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నట్లు గుర్తుచేస్తున్నారు. అదే ఫామ్ కొనసాగించి దేవర మూవీ స్టిల్ లో రోహిత్ శర్మ ఫోటోను వైరల్ చేస్తూ పరుగుల వరద పారిస్తారని పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ముగిసిన బోర్డర్ […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తనను జగనన్న 2.0గా కొత్తగా చూస్తారు అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. జగనన్న 2.0 అంటూ జగన్ కొత్త నాటకం మొదలెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ పై మండిపడ్డారు. ‘జగన్ అంటున్నట్లు అది 2.0 కాదు.. పాయింట్ 5. ఆయన కాళ్ల కింద వ్యవస్థలు నలిగిపోయాయి. ఐదేళ్లలో కార్యకర్తలను పట్టించుకోని జగన్ ఇప్పుడు వారి గురించి మాట్లాడటం వింతగా ఉంది. […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారని అన్నారు. ‘2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డా. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను. ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా’ అని వైఎస్ […]Read More
రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఛాంపియన్ ట్రోపీ తర్వాత హిట్ మ్యాన్ క్రికెట్ నుండి రిటైర్ అవుతారనే వార్తలు వచ్చాయి.. వీటిని ఉద్ధేశిస్తూ రిటైర్మెంట్ తర్వాత ‘మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?’ అని మీడియా ప్రశ్నించింది. ‘ఇదేం ప్రశ్న. త్వరలో వన్డే సిరీస్, ఛాంపియన్ ట్రోపీ జరగనున్నాయి. ప్రస్తుతం అవే నాకు […]Read More