Month: February 2025

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నేడే తండేల్ విడుదల..శోభిత ఆసక్తికర పోస్టు.!

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా.. నేచూరల్ బ్యూటీ .. స్టార్ హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ తండేల్’ . ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హీరో నాగచైతన్య సతీమణి శోభిత మూవీ యూనిట్ కు విషెస్ తెలిపారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టి సారించారు.. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేనకు శుభవార్త..!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసైనికులకు ఇది నిజంగానే శుభవార్త. తాజాగా జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన సంగతి మనకు తెల్సిందే. ఇప్పుడు తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. మరోవైపు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును జనసేనకు ఈసీ కేటాయించింది. 2024లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21 […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..!

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బీసీ సామాజిక వర్గ నేతలను.. ఆ వర్గాలను సంతృప్తి పరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ శుభవార్తను తెలపనున్నట్లు తెలుస్తుంది. తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో బీసీల కేంద్రంగా తాజా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక డిప్యూటీ సీఎం […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్. ఈ సినిమా టికెట్ ధరలపై చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో అరవింద్ మాట్లాడుతూ ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరలను పెంచాలని అడిగాము.. తెలంగాణలో టికెట్ ధరలను పెంచాలని మేము ఎవర్ని అడగలేదు.. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు పెరిగి ఉన్నాయి.. టికెట్ ధరలు రూ.50 పెంచాలని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తూచ్.. పదేండ్లు కాదు ఐదేండ్లే..!

గతంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పదేండ్లు నేనే సీఎం కుర్చిలో కూర్చుంటాను.. ఇరవై ఏండ్లు తామే అధికారంలో ఉంటామని వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఐదేండ్లు తామే అధికారంలో ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీఎల్పీ భేటీ అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన ఆ 4గురు ఎమ్మెల్యేలు ..!

గురువారం మర్రి చెన్నారెడ్డి భవన్ లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టీ విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా మున్సీ ఆధ్వర్యంలో సీఎల్పీ భేటీ జరిగింది. ఈ భేటీ సుధీర్ఘంగా జరిగింది. ఏడాదిగా ఇటు పార్టీలో.. అటు ప్రభుత్వంలో జరిగిన మంచి చెడ్డల గురించి చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు.. మంత్రులు..ఎమ్మెల్సీలు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. ఈ భేటీకి పార్టీ తరపున అందరూ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

విజయ్ దేవరకొండ కొత్త మూవీ టైటిల్ ఇదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రౌడీ ఫెలో విజయ దేవరకొండ హీరోగా జేర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.ఈ చిత్రం టైటిల్ ఏమటన్నది ఇటు విజయ్ అభిమానులు.. అటు సినీ ప్రేక్షకుల మదిలో తీవ్ర అసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్ ట్రైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరో విజయ్ దేవర కొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కన్పించనున్నారు అని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎస్సీ వర్గీకరణ ఆగే ప్రసక్తే లేదు..!

తాము ఎవరికీ భయపడేది లేదు.. ఎస్సీ వర్గీకరణ అగే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా అన్నారు. మాదిగ మాదిగ ఉప కులాల నాయకులు నిన్న గురువారం మంత్రి దామోదర రాజనరసింహాను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ మాదిగల సమిష్టి కృషి.. సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉన్న కమిట్మెంట్ వల్లనే వర్గీకరణ సాధ్యమవుతుందని అన్నారు. గత […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఒక్కొక్క ఎమ్మెల్యేకి రూ.15కోట్లు ఆఫర్..!

సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15కోట్లను బీజేపీ ఆఫర్ చేసింది అని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీ రాష్ట్రంలోని మొత్తం డెబ్బై స్థానాలకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. రేపు ఎనిమిదో తారీఖు ఆ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేయడం ఢిల్లీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఆప్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దానం.. ఆగమాగం..!

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండీ బీఆర్ఎస్ తరపున గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా పార్టీ ఫిరాయింపుల విషయంపై బీఆర్ఎస్ పార్టీ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేసు వేసింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు చూస్తే నొయ్యి.. వెనక చూస్తే గొయ్యి అన్నట్లు మారింది. అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన […]Read More