Month: February 2025

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో లా సెట్, ఈ సెట్ షెడ్యూల్ విడుదల

ఈ నెల 25న లాసెట్, ఈసెట్ నోటిఫికేషన్లు విడుదల. మే 12న ఈసెట్, జూన్ 6న లాసెట్ పరీక్ష. మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు ఈసెట్ దరఖాస్తులు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు లాసెట్ దరఖాస్తులు. మే 25 వరకు జరిమానాతో దరఖాస్తుల స్వీకరణ.Read More

Breaking News International Lifestyle Slider Top News Of Today

భారత విద్యార్ధుల్లో ‘ట్రంప్’ భయం.. !

సింగిడి న్యూస్ : పైసామే పరమాత్మ హై. అనేది ఓ నానుడి. అదే అమెరికా పైసలయితే ఇంకాస్త ఎక్కువ పరమాత్మ దక్కుతుంది. బంధులు, స్నేహితులు, తెలిసిన వారిదగ్గర పరపతి కూడా పెద్దదవుతుంది. అందుకే ఈ అమెరికా డ్రీమింగ్‌, డాలర్‌ చేజింగ్‌. అయితే ఈ చేజింగ్‌లో చాలా జరుగుతున్నాయి. అమెరికాకు డాంకీ రూట్‌లో వచ్చి యువకులు దొరికిపోతున్నారు. జైళ్లకు వెళ్తున్నారు. దీంతో ఇంటి దగ్గర తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు స్టూడెంట్స్‌ పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ చేస్తూ దొరికిపోవడం జరుగుతోంది. ఇలాంటి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నిబంధనలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు:

బల్దియా పరిధిలోని హనుమకొండ వరంగల్ ప్రాంతాలలో నిర్మాణాల అనుమతుల మంజూరు కోసం దరఖాస్తులు సమర్పించిన నేపథ్యం లో కమిషనర్ క్షేత్ర స్థాయి లో పర్యటించి పరిశీలించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం హన్మకొండ పరిధి లో హంటర్ రోడ్, కాకతీయ యునివర్సిటీ సమీపం లోగల శ్రీ సాయినగర్ కాలనీ వరంగల్ పరిధి మెట్ల బావి ఆరేపల్లి ప్రాంతాలలో కమిషనర్ పర్యటించి కొలతలు వేసి పరిశీలించారు. ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ నగరవాసులు భవన నిర్మాణాలు చేపట్టడానికి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహం ఆవరణను పరిశీలించారు. అక్కడి నుంచి కిచెన్, స్టోర్ రూంకు వెళ్లి సరుకుల నాణ్యత, ఆహార పదార్థాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులు చదువుతుండగా, వెళ్లి […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఢిల్లీ సీఎం అతిశీ విజయం…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముందు నుండి వెనుకంజలో ఉన్న ముఖ్యమంత్రి అతిశీ ఘనవిజయం సాధించారు. ఆప్ తరపున కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిధూరి పై అతిశీ గెలుపొందారు. మరోవైపు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఓటమిపాలయ్యారు. ఇప్పటికి బీజేపీ నలబై ఎనిమిది.. ఆప్ ఇరవై రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.షాకూర్ బస్తీలో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఓటమిపాలయ్యారు.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఢిల్లీ సీఎం గా పర్వేశ్ వర్మ…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన మాజీ సీఎం.. ఆప్ పార్టీ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ను పన్నెండు వందల ఓట్లతో ఓడించాడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ. ఢిల్లీ సీఎం గా పర్వేశ్ వర్మను ఎంపిక చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ మొత్తం నలబై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ పార్టీ ఇరవై రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

అరవింద్ కేజ్రీవాల్ ఓటమి..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాజీ సీఎం.. ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. అరవింద్ కేజీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయనను మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ పై […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఢిల్లీ ఎన్నికల తొలి ఫలితం.! గెలుపు ఎవరిదంటే..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వెలవడింది. మొదటి గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీని వరించింది. కొండ్లీ నియోజకవర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థి కుల్దీప్ కుమార్ తన సమీప అభ్యర్థి ప్రియాంక గౌతమ్(బీజేపీ)పై 6293+ ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. ఇప్పటివరకూ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నలబై ఆరు చోట్ల.. ఆప్ ఇరవై నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉంది.కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి కూడా ఖాతా తెరవలేదు.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఓటమి దిశగా ఢిల్లీ సీఎం..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ తరఫున కల్కాజీ నుంచి పోటీ చేసిన సీఎం ఆతిశీ మార్లేనా వెనుకంజలో కొనసాగుతున్నారు. ఉదయం లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఆమె ఏ దశలోనూ లీడింగ్లోకి రాలేదు. ఆతిశీపై బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరీ 3,231 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రమేశ్ లీడింగ్ ఇలాగే కొనసాగితే ఆతిశీ ఓటమి ఖాయమైనట్లే. అటు కేజీవాల్ పై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ 1200ఓట్ల తేడాతో గెలుపొందారు..Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

సీఎం అతిశీ వెనకంజ..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి అతిశీ వెనకంజలో ఉన్నారు . బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి 3,325ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన సంగతి తెల్సిందే. ఇప్పటివరకూ వెలువడుతున్న ఎన్నికల ఫలితాల ప్రకారం బీజేపీ 46చోట్ల.. ఆప్ 24చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ ఒక్కచోట కూడా ఆధిక్యంలో లేకపోవడం విశేషం. మాజీ సీఎం.. ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ ఎమ్మెల్యే […]Read More

What do you like about this page?

0 / 400