తెలంగాణలోని మద్యం ప్రియులకు షాకిచ్చింది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రంలో బీర్ల ధరలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పెంపు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నది. ధరల నిర్ణయ కమిటీ సూచనల మేరకు రేట్లు పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ధరల పెంపు నిర్ణయంతో ఒక్కో బీరుపై సగటున రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగే అవకాశం ఉన్నదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. […]Read More
తెలంగాణలోని సికింద్రాబాద్ నుండి ఏపీలోని విజయవాడల మధ్య తిరిగే శాతవాహన ఎక్స్‌ప్రెస్ (నం.12713/12714) రైలులో ప్రయాణించే వారికి రైల్వే అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ రైలుకు ప్రస్తుతం ఉన్న ICF కోచ్‌ల స్థానంలో ఆధునిక లింకే హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర మీదుగా వెళ్లే ఈ రైలు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌గా ఎంతో పాపులర్ అయిన సంగతి మనకు తెల్సిందే.Read More
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ తీసుకురావాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఆలోచిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా జమిలీ ఎన్నికల గురించి ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రంలో మనకు పూర్తి సహాకారం ఉంది. బడ్జెట్ లో కూడా నిధులు ఎక్కువగా కేటాయించారు. […]Read More
ఏఐసీసీ సీనియర్ నాయకులు.. లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. అక్కడ నుండి హనుమకొండలో జరగనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరవుతారు. అనంతరం ట్రైన్లోనే చెన్నైకి తిరిగి ప్రయాణం కానున్నారు.Read More
తెలంగాణలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, రీచ్‌ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. ఇందిరమ్మ ఇండ్లకు […]Read More
విక్టరీ వెంకటేష్ హీరోగా..ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. దాదాపు మూడు వందల కోట్లకు పైగా రూపాయాలను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ను రప్పాడించింది. ఈ చిత్రం యొక్క సక్సెస్ మీట్ ను యూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రతి సంక్రాంతి పండక్కి వచ్చిన మూవీ హిట్ అవ్వడమే కాదు బాక్సాఫీస్ ను […]Read More
మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ కేంద్రంలో బీఆర్ఎస్ రైతు భరోసా దీక్ష కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ఓ యువతి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు చీప్ మినిస్టర్ అని తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు. ఇంకా ఆ యువతి మాట్లాడుతూ ” మేము బీఆర్ఎస్ పార్టీ ఫెయిడ్ బ్యాచ్ అని అబద్ధాలు చెబుతున్నారు.మేము బీఆర్ఎస్ ఫెయిడ్ బ్యాచ్ కాదు.. కేటీఆర్ […]Read More
తెలంగాణలో ఈ నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు.. జారీ ప్రక్రియను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర సంక్షేమ శాఖ కీలక ఆదేశాలను ఇచ్చింది. ఈ ఆదేశాలతో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై నెలకొన్న అయోమయం వీడినట్లైంది.తాజాగా పౌరసరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయంతో సోమవారం నుంచి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కులగణన లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో ఇప్పటికే […]Read More
దాడి జరిగింది తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం కి దగ్గరలో ఉన్న గుండాలలో కాదు. పోనీ ఇటు వైపు వస్తే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలోనూ కాదు. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని మహానగరం.. రాష్ట్ర గుండెకాయ అయిన హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న చిలుకూరి బాలజీ ఆలయంలోని ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై. ఈ దాడి జరిగి కూడా రెండు రోజులవుతుంది. ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా.. అటు సోషల్ మీడియాలో […]Read More