Month: January 2025

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత..!

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు.. ఎంపీ ప్రియాంకా గాంధీపై బీజేపీకి చెందిన నేత.. ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ దగ్గర ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రేపు బుధవారం మధ్యాహ్నం విశాఖ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ క్రమంలో బుధవారం మ.12 గంటలకు విశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ చేరుకోనున్నారు. అనంతరం ఆరోజు సా.4:15 గంటలకు INS డేగాలో ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తో కలిసి విశాఖ పర్యటనకు రానున్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం సా.4:45 నుంచి ప్రధాని మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఈనెల 9న కేటీఆర్ విచారణకు వెళ్తారు..!

బీఆర్ఎస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు నందినగర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ” ఈ నెల తొమ్మిదో తారీఖున ఏసీబీ విచారణకు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. హైకోర్టు విచారణకు హాజరు కావాలని తీర్పునిస్తే కొంతమంది కాంగ్రెస్ నేతలు వక్రమాటలు మాట్లాడుతున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో జరిగిన అవతవకలు.. అవినీతిని డైవర్ట్ చేయడానికి కుట్రలు చేస్తున్నారు. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

సీఎం పేరు తెలియనోళ్ళు యాంకరింగ్ చేయద్దా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తెలియని వాళ్లు యాంకరింగ్ ఎలా చేస్తారని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలుగు సమాఖ్య మహాసభల్లో ప్రముఖ నటుడు, యాంకర్ బాలాదిత్య ముఖ్యమంత్రి పేరును తప్పుగా చెప్పడంపై ఆయన మండిపడ్డారు. ఎంపీ అయిన తానే ఏదైనా విషయం మాట్లాడాలంటే పేపర్ రాసుకుని జాగ్రత్తగా మాట్లాడతానని చెప్పారు. అలాంటిది ఒక యాంకర్ ఇలా చేయడమేంటని, […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నందిగం సురేష్ కు బెయిల్ నిరాకరణ

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ కు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మాజీ ఎంపీ సురేష్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో సురేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్న విషయం మనకు తెలిసిందే.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతు భ‌రోసా పూర్తి స్థాయిలో అమలు చేయాలి.!

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేర‌కు రైతుల‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని భార‌త రాష్ట్ర జాగృతి రాష్ట్ర ఉపాధ్య‌క్షులు దాస్యం విజ‌య్ భాస్క‌ర్ గారు డిమాండ్ చేశారు. బాల‌స‌ముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అరెస్ట్ నేప‌థ్యంలో అక్క‌డికి చేరుకున్న ఆయ‌న్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ ఆఫీసులోనే నిర్బంధించారు. పోలీసుల‌కు, విజ‌య్ భాస్క‌ర్ గారికి వాగ్వాదం చేటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఇచ్చిన రైతు డిక్ల‌రేష‌న్ అమ‌లు చేయ‌మ‌ని ప్ర‌శ్నిస్తే అక్ర‌మ అరెస్ట్‌లు ఏంట‌ని అన్నారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ..!

హైకోర్టులో దాఖలు చేసిన నాట్ టూ అరెస్ట్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజధాని నగరం హైదరాబాద్ లోని నందినగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.. హైకోర్టు తీర్పుపై లీగల్‌ టీమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలా…? లేదా..? అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు.. ఇప్పుడు ఏసీబీ తీసుకునే నిర్ణయంపై […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కోటి ఎకరాలకే రైతు భరోసా..?

ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుండి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలో సాగుచేసే కేవలం కోటి ఎకరాలకు మాత్రమే రైతు భరోసాని ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు ఐదు వేల నుండి ఆరు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం. గతంలో అధికారంలో ఉన్న […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టు షాక్..!

ఫార్ములా ఈ రేసు కారు కేసులో తనను ఏసీబీ ఆరెస్ట్ చేయద్దని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టీవేసింది. దీంతో ఏసీబీ ఈ కేసులో దూకుడు పెంచింది. ఫార్ములా -ఈ రేసు కారు కేసుకు సంబంధించి పలుచోట్ల ఏసీబీ సోదాలను నిర్వహిస్తుంది. ఏపీలో విజయవాడ.. తెలంగాణలో హైదరాబాద్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మహిళ అభిమానికి వెంకటేష్ హాగ్

సంక్రాంతికి వస్తున్నాం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తన అభిమాని పట్ల విక్టరీ వెంకటేశ్ తన ప్రేమను చాటుకున్నారు. ఈ ఈవెంట్ కి వచ్చిన ఓ లేడీ ఫ్యాన్ ను హీరో వెంకటేశు ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెబుతారని యాంకర్ శ్రీముఖి  ప్రశ్నించారు. దీనికి తన భర్త ఒప్పుకోరని ఆమె సమాధానమిచ్చారు.. దీంతో వెంటనే వెళ్లి వెంకటేశ్ ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో లేడీ ఫ్యాన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.Read More