పుణేలో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో మూడు మార్పులతో ఇండియా బరిలోకి దిగుతోంది. షమీ స్థానంలో అర్ష్దీప్, జురెల్ స్థానంలో రింకూ సింగ్, సుందర్ స్థానంలో శివమ్ దూబే ఆడనున్నారు. జట్టు: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షీదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.Read More
మరో ఐదు రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో తమకు సీటు ఇవ్వలేదని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిన వారిలో నరేశ్ యాదవ్, రాజేశ్ రిషి, మదన్ లాల్, రోహిత్, బీఎస్ జూనే, పవన్ శర్మ, భావన గౌర్ ఉన్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఎన్నికలు జరగనుండగా, 8న ఫలితాలు వెల్లడి కానున్నాయిRead More
ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. ఆయన మాట్లాడుతూ పద్నాలుగు నెలల పాటు ఫామ్ హౌజ్ లో పడుకున్నాడు. గంభీరంగా చూస్తున్నాడంట. ఏమి చూస్తున్నాడు కేటీఆర్.. హారీష్ రావులను ఊర్ల మీదకు వదిలాడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలగా మార్చారు. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ కేవలం రైతులు తమకున్న వడ్డీలు కట్టడానికే సరిపోయింది. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేశాము. కేసీఆర్ […]Read More
మాదిగల ద్రోహి కాంగ్రెస్.ఎస్సీ రిజర్వేషన్ అమలులో కాంగ్రెస్ దొంగాట ఆడుతుందనిఖమ్మం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫైర్ అయ్యారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లోని రెండు అసెంబ్లీ స్థానాలలో మాలలకే కేటాయించింది కాంగ్రెస్..అసెంబ్లీ స్పీకర్, కీలకమైన డిప్యూటీ సీఎం పదవులు సైతం మాలలకేనా ..? అని ప్రశ్నించారు..ఎస్సీ రిజర్వేషన్ను అమలు చేసి మాదిగ సామాజిక వర్గాలను సామాజిక న్యాయం చేయాలన్న భారత సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం […]Read More
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ కూడా ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 170 పెరిగి రూ.83,020కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.76,100గా నమోదైంది. అటు వెండి ధర కేజీపై రూ.2వేలు పెరిగింది. ప్రస్తుతం కేజీ రేట్ రూ.1,06,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.Read More
బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షిక దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు పాల్గోన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.. ఈ రంగాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. విద్య పై పెట్టుబడి మూలంగా గొప్ప మానవ వనరులు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయి ఫలితంగా ప్రపంచాన్ని ఏలే శక్తి తెలంగాణ కు దక్కుతుందని ఆయన […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ లోని ఎర్రవల్లి తన ఫామ్ హౌజ్ లో మెదక్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు.. బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాబోయేది మన ప్రభుత్వమే. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు. నిన్న కాంగ్రెస్సోళ్ళే పెట్టిన పోల్ సర్వేలో కూడా ప్రజలు మనకే ఓట్లు వేశారు. నేను మౌనంగా ఉన్నాను . కానీ అన్నింటిని […]Read More
అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ కి చేరింది భారత మహిళల జట్టు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు ఇరవై ఓవర్లు ఆడి 113పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్ కమలిని ఆర్ధశతకంతో చెలరేగారు. యాబై బంతుల్లో యాబై ఆరు పరుగులతో నాటౌటుగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయి గొంగిడి త్రిష […]Read More
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టులో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయి. బీఆర్ఎస్ తరపున గెలిచిన పది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును అశ్రయించింది. ఈ పిటిషన్ పై పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ సమయంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరపున వాదిస్తున్న ముకుల్ రోహిత్గి […]Read More
చేతులెత్తేసిన మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఆందోళనలో సీఎం..!
అలవికానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ముందు చూస్తే గోయ్యి.. వెనక చూస్తే నొయ్యి అన్నట్లు ఉంది పరిస్థితి. అధికారంలోకి వస్తామో.. రామో అనే సందేహాంతో అన్ని వర్గాలకు దాదాపు నాలుగోందల ఇరవై హామీలిచ్చారు.తీరా అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఆసరా, రైతుబంధు,రైతు భరోసా,కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు లాంటి పథకాలను గాలికోదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తాము ఇస్తామన్న నెలకు నాలుగు వేల రూపాయలు.. కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం.. […]Read More