Month: December 2024

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ పోలీస్ లోగో లో మార్పు..!

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన లోగోను మార్పుస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నట్లు అధికారక జీవో తీసుకురావడమే కాకుండా సాక్షాత్తు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంతో అట్టహాసంగా ఆవిష్కరించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్ అనే లోగోను తీసుకు వచ్చారు. దీనికి సంబంధించిన లోగో ప్రస్తుతం వైరల్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఆసీస్ ఆలౌట్ .. కష్టాల్లో టీమిండియా..!

బోర్డర్ గవాస్కర్ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే ఆసీస్ ఆలౌటైంది. ఐదో రోజు ఆట ప్రారంభం కాగానే రెండో ఓవర్లో ఆస్ట్రేలియా జట్టు తన చివరి వికెట్ ను కోల్పోయింది. భారత్ ఫేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసీస్ బ్యాట్స్ మెన్ లయన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ 234పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియా ముందు 340 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. […]Read More

Breaking News Slider Sports Top News Of Today

బుమ్రా ఓ రికార్డు..!

టీమ్ ఇండియా ‘పేస్’ గుర్రం జస్పీత్ బుమ్రా మరో  అరుదైన రికార్డును సృష్టించారు. టెస్టుల్లో 20 లోపు సగటుతో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా బుమ్రా చరిత్రకెక్కారు. మొత్తం 44 మ్యాచుల్లో 19.46 సగటుతో ఆయన 202 వికెట్లు దక్కించుకున్నారు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్ గానూ బుమ్రా రికార్డులకెక్కారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీకి కొత్త సీఎస్ ఖరారు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎస్ గా విజయానంద్ పేరు ఖరారైంది. ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో ప్రభుత్వం కొత్త సీఎసన్ను నియమించింది. కాగా 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి అయిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం..!

ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు..ఈ నిర్ణయంలో భాగంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తనను కలిసే అభిమానులు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వాటికి బదులు పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని ఆయన కోరారు. తనకు అభిమానులు నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలు చాలని పేర్కొన్నారు. పెన్నులు, పుస్తకాలు ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విధంగానైనా పేదలను ఆదుకోవచ్చని పేర్కొన్నారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

యాసంగికి రైతు భరోసా..!

డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ఆదివారం రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.. సుదీర్ఘంగా దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన భేటీ జరిగింది.ఈ భేటీ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిరైతు మోములో వెలుగు నింపే ఆశయంతో రూ. 72,659 కోట్ల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ చచ్చిన ఓ పాము..!

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిజామాబాద్ పర్యటనలో బీజేపీ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘునందన్ రావు కౌంటరిచ్చారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత పదేండ్లలో ఎన్నో అవినీతి అక్రమాలు చేశారని బీఆర్ఎస్ నేతకపై ఆరోపణలున్నాయి.. అధికారం కోల్పోయి బీఆర్ఎస్‌ పార్టీ ఓ చచ్చిన పాములా తయారైంది..మాజీ మంత్రి కేటీఆర్‌ పై ఉన్న […]Read More

Breaking News National Slider Top News Of Today

మోదీ మన్ కీ బాత్ లో ఏఎన్ఆర్..?

ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’ లో ప్రధాని నరేంద్ర మోదీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలను చూపిస్తూ టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో మోదీ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నాణ్యమైన విద్యతో పాటు స్కిల్స్..!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ చిన్నారులు, విద్యార్థులకు నేర్పించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను ప్రదర్శించిన అక్కడి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR  ముందుచూపుతోనే RRR

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి..బీఆర్‌ఎస్ అధినేత,    కే చంద్రశేఖర్‌రావు దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్‌ రింగు రోడ్డు (ట్రిఫుల్‌ఆర్‌) ఆలోచన చేశామని బీఆర్‌ఎస్ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు.  హైదరాబాద్‌ నగరానికి వచ్చే పది జాతీయ రహదారులను అనుసంధానించేలా ట్రిఫుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ రూపొందించామని పేర్కొన్నారు. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్‌ గడ్కరీతో కేసీఆర్‌, తాను బీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి అనేక సందర్భాల్లో చర్చించామని, అనుమతులు పొందామని గుర్తుచేశారు. ఔటర్‌ రింగు రోడ్డు […]Read More