ఈ నెల 9 వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రధాన ముఖద్వారం ముందు భాగంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు గారితో పాటు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని ఆహ్వానం అందించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 7, 8, […]Read More
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దృఢ సంకల్పాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. మహిళా సాధికారత కోసం తెలంగాణలో మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొనియాడారు. ఈ స్వయం సహాయక సంఘాలు భవిష్యత్తులో మరింత శక్తివంతం కావాలని ఆకాంక్షించారు.స్వయం సహాయక సంఘాల కోసం నగరం నడిబొడ్డులోని శిల్పారామంలోని 3.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ను గవర్నర్ గారు ప్రారంభించారు. ముఖ్యమంత్రి , ఉప […]Read More
చిత్రం: పుష్ప2: ది రూల్; నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనుంజయ, జగదీశ్ ప్రతాప్ భండారి, తారక్ పొన్నప్ప, అజయ్, శ్రీతేజ్ తదితరులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్ కూబా బ్రోజెక్; ఎడిటింగ్: నవీన్ నూలి; నిర్మాత: నవీన్ యెర్నేని, రవి యలమంచిలి; సంభాషణలు: శ్రీకాంత్ విస్సా; పాటలు: చంద్రబోస్; రచన, దర్శకత్వం: సుకుమార్; నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్; విడుదల: […]Read More
ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి
హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రజలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున కార్యక్రమానికి హాజరై మంత్రి జూపల్లికి పలు సమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఫించన్లు, రెవెన్యూ, తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. దరఖాస్తులకు స్వీకరించినప్పుడు మంత్రి జూపల్లి ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ పుష్ప -2. ప్రస్తుతం ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో పుష్ప -2 సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఏడాది కిందట ‘WHERE IS PUSHPA’ అంటూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ సీక్వెన్స్ వీడియోలు సినిమాలో ఎక్కడా కనిపించలేదు. దీంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లోకి తప్పించుకుపోయిన పుష్పను చూసి పెద్ద […]Read More
ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలకు అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు బంగం వాటిల్లుతుందన్నారు. గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల మెడికల్ క్యాంపును గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ” కేవలం వార్తలు, వృత్తే కాకుండా […]Read More
కేసీఆర్.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం…
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 7, 8, 9 తేదీల్లో సచివాలయ ప్రాంగణం.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ సంబరాలు అద్భుతంగా నిర్వహించనున్నట్లు సీఎం చెప్పారు. తెలంగాణ సంస్కృతికి పట్టం కట్టే కార్యక్రమాలు, పిండి వంటలు, మహిళా సంఘాల స్టాళ్లతో ఒక పండగ వాతావారణం నెలకొంటుందని సీఎం చెప్పారు. బోనాలు, వినాయక […]Read More
ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో తొలి ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి ఇంటికి రూ.5 లక్షలు ఇస్తున్నామని.. దేశంలో ఇంత మొత్తం కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇళ్ల నిర్మాణం ద్వారా […]Read More
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విజయవంతంగా సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి అహరహం శ్రమిస్తుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంత చేస్తూ ప్రజల ముందు మరింత చులకనవుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ కెటిఆర్ ను ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని విమర్శిండమే ధ్యేయంగా అర్థంలేని ఆరోపణలు […]Read More