సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి ఇటీవల పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప -2 లో కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ తో మెరిసిన స్టార్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఐటమ్ సాంగకు నో చెప్పాలని ఈ హాట్ బ్యూటీ డిసైడ్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’లోనూ ఐటం సాంగ్ ఆఫర్ రాగా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత..మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి నివాసంలో ఉదయం 10.30గంటలకు జరిగే ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపైనా ఆయన సూచనలు చేస్తారని సమాచారం. అటు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీమంత్రి హరీశ్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో ఛార్జిషీట్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ (#YTPS)కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. నాలుగు వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 800 మెగావాట్ల యూనిట్-2 నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి, గ్రిడ్‌కు అనుసంధానించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంతకుముందు థర్మల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల యూనిట్-2 […]Read More
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. “ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది” అని అన్నారు. ప్రజా పాలన – ప్రజా […]Read More
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల విరాళం అందజేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ కల్నల్ పి.రమేశ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి త్రివర్ణ పతాక స్టిక్కర్‌ను అందించారు. యుద్దంలో గాయపడిన వీర సైనికుల పునరావాసం, వారి కుటుంబాల సంక్షేమం, పునర్నివాసం వంటి కార్యక్రమాలకు ఉద్దేశించిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆహ్వానించారు. ఇదే అంశంపై కేసీఆర్‌ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే..మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఒకవైపు ప్రజా పాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించావని ధ్వజమెత్తారు. మీ అప్రజాస్వామిక […]Read More
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మంచి పనైనా చేశారా అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రశ్నించారు. గచ్చిబౌలి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హారీష్ రావు మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ‘పోలీసులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సీఎం రేవంత్ ఆదేశాల ప్రకారం పని చేయకూడదు. ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతులను నొక్కాలని ప్రభుత్వం చూస్తోంది’ అని […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా అల్లుడు శ్రీనులో హీరోయిన్ గా అందాల రాక్షసి..సీనియర్ నటి సమంత నటించిన సంగతి తెల్సిందే.. ఈ చిత్రం నిర్మాణ సమయంలో సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారని ఆ మూవీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘చికిత్సకు సమంతకు అవసరమైన డబ్బులు నిర్మాతలెవరూ ఇవ్వలేదు. ఆ సమయంలో నేను రూ.25 లక్షలు ఇచ్చాను. ఆమె ప్రైవసీ కోసం సినిమా అయ్యేదాకా […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు బిగ్ షాకిచ్చారు..ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ చర్యలకు అనుగుణంగా మహానగరంలో డీజిల్ ఆటోలను నగరం వెలుపల ఉన్న ఓఆర్ఆర్ బయటకు పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రిత్వ,అధికారులకు సూచించారు. అయితే వారు ఎలక్ట్రిక్ ఆటోలు […]Read More