ఖమ్మం మార్కెట్ లో పత్తి మిర్చి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు MLC తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య , కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ Y శ్రీనివాస్, Rjc కృష్ణ మరియు తదితరులు.బిఆర్ఎస్ […]Read More
తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై కీలక తీర్పును వెలువరించింది.. అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది నిర్ణయం తీసుకోవాలన్న డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ విషయంలో స్పీకర్‌కు ఎలాంటి టైం బాండ్ లేదన్నది హైకోర్టు.. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది.Read More
ఏపీకి చెందిన సీనియర్ బీజేపీ నేత.. నరసాపురం పార్లమెంట్ సభ్యులు .. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ(బీజేపీ వర్మ)ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ రాజు (91) నిన్న గురువారం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈరోజు శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి.Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. పదేండ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. ఒక్క పరిశ్రమ రాలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దాదాపు పదిహేడు వేల ఎకరాల భూమిని సేకరించాము. ఎక్కడా కూడా బాధితులకు నష్టం రాకుండా పరిహారం అందించాము. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయలేదా మేము.. ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్ళే కదా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చింది. […]Read More
బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనవాళ్లు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ అనవాళ్లు చెరిపేయడం రేవంత్ రెడ్డి వల్లనే కాదు ఏ కాంగ్రెస్ నేతకు చేతకాదు అని గురువారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆయన ఇంకా మీడియాతో మాట్లాడుతూ ” కేసీఆర్ అనవాళ్లు చెరిపేయడానికి బ్లాక్ బోర్డుపై చాక్ పీస్ తో రాసిన పేరు కాదు.. తెలంగాణ ప్రజల […]Read More
మహారాష్ట్ర లో 1995తర్వాత అత్యధికంగా పోలింగ్ నమోదు..!
మహారాష్ట్రలో ఉన్న 288 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన పోలింగ్ శాతం 1995తర్వాత అత్యధికంగా నమోదైంది. మొత్తం పోలింగ్ శాతం 65.1% గా నమోదైందని ఎన్నికల కమిషన్ తెలిపింది. 1995లో రికార్డు స్థాయిలో అంటే ఏకంగా పోలింగ్ శాతం 71.5% గా నమోదైంది. ఎక్కువమంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల తమకే అనుకూలం అని ఆయా రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. అయితే తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ కూటమికే అనుకూలంగా ఉన్నాయి. ఈ […]Read More
ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. నటి రేణు దేశాయ్ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని రేణునే తన సోషల్ మీడియా అకౌంటు వేదికగా తెలిపారు. తన తల్లి ఫోటోని షేర్ చేస్తూ ఓం శాంతి అని పోస్టు చేశారు. దీంతో నటి రేణు ను నెటిజన్లు ఓదారుస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.Read More
ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గౌతమ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. అదానీ గ్రూప్ తో కుదుర్చుకున్న రెండు భారీ ఒప్పందాలను కెన్యా దేశం రద్ధు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పవర్ ట్రాన్స్ మిషన్ లైన్స్ నిర్మించేందుకు దాదాపు ఏడు వందల మిలియన్ డాలర్ల ఎనర్జీ ఒప్పందాన్ని కెన్యా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు విలియం రుతో వెల్లడించారు. దాంతో పాటు జేకేఐ విమానాశ్రయాన్ని విస్తరించేందుకు జరుపుతున్న ప్రణాళికలను కూడా నిలిపేస్తున్నామని ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే అదానీ […]Read More
టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్.. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే ఆయన తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా మేఘాలయ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తరపున అద్భుతమైన డబుల్ సెంచురీ చేశారు. మొత్తం 229బంతుల్లో నే అజేయ ద్విశతకం బాదేశాడు. ఇందులో 34ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మొదటి ఇన్నింగ్స్ లో మేఘాలయ 260పరుగులకు ఆలౌటైంది. మరోవైపు ఆర్యవీర్ విజృంభణతో రెండో రోజు ఆట ముగిసేసమయానికి […]Read More
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ హ్యుజ్ క్రియేట్ చేశాయి. జీబ్రా నవంబర్ 22న థియేటర్లలోకి […]Read More