Month: November 2024

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఆరోజే ఓటీటీలోకి అమరన్

కన్నడ హీరో శివ కార్తికేయన్, నేచూరల్ బ్యూటీ . లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీ ఈ నెల 29న ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెటిక్స్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నిమ్స్ లో గురుకుల విద్యార్థికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ

కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించిదనీ తెలుసుకొని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాజీవ్ సాగర్, హుటాహుటిన నీమ్స్ ఆసుపత్రికి చేరుకుని శైలజ ఆరోగ్యం పరిస్థితి డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా మాట్లాడారు..కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ

టీమ్ ఇండియా ప్లేయర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించారు. టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా ఆయన రికార్డు సాధించారు. సౌతాఫ్రికాపై రెండు, మేఘాలయపై ఓ సెంచరీ వరుసగా బాదారు. టీ20 చరిత్రలోనే ఇప్పటివరకు మరే బ్యాటర్ హ్యాట్రిక్ సెంచరీలు చేయలేదు. మరోవైపు టీ20ల్లో అత్యధిక స్కోరు బాదిన ప్లేయర్ గా కూడా తిలక్ (151) నిలిచారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ (147) రికార్డును ఆయన అధిగమించారు.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

హేమంత్ సోరెన్ కి కల్సివచ్చిన సెంట్మెంట్..!

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మరోసారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని వార్తలు వస్తున్నాయి. జైలుకు వెళ్లి రావడం ఆయనకు కలిసొచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సీఎం మయ్యా యోజన కింద మహిళలకు రూ.2,500 ఇస్తామనడం కూడా ఓట్లు రాలడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియా కూటమి 54 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.బీజేపీ 24స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తుంది. ఇప్పటికే మెజార్టీ మార్కును దాటడంతో ఇండియా కూటమిలో […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోష్..!

కర్ణాటక ఉపఎన్నికలో కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది. శిగ్గావ్లో బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మైపై కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ పఠాన్ గెలుపొందారు. మరోవైపు సందూర్లో కాంగ్రెస్ క్యాండిడేట్ అన్నపూర్ణ ఘన విజయం సాధించారు. దీనిపై ఈసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తం మూడుచోట్ల ఉపఎన్నిక జరగ్గా చన్నపట్నలోనూ కాంగ్రెస్ అభ్యర్థి యోగీశ్వర ముందంజలో ఉన్నారు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీకి బిగ్ షాక్..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ మోషేను రాజుకు పంపారు. కాగా కైకలూరుకు చెందిన వెంకటరమణ గతంలో టీడీపీలో పనిచేశారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ఆయన సైలెంట్ […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ప్రియాంకా గాంధీ ఘన విజయం

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ ఘన విజయం సాధించారు. ఆమె ఇప్పటికే 4,03,966 ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో ఆమె గెలుపు లాంఛనంగా మారింది. తర్వాతి స్థానాల్లో CPI, BJP ఉన్నాయి. గత ఎన్నికల్లో 3.64 లక్షల ఓట్ల మెజారిటీతో రాహుల్ MPగా గెలిచిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేయడంతో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో తాజాగా ప్రియాంక గెలిచారు.మరోవైపు రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యవన్ నిలిచారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి పతనం మొదలయింది

చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి పరామర్శించిన కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పేద, గిరిజన, బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి జైలు పాలైన మా నరేందర్ రెడ్డి గారిని చర్లపల్లి జైల్లో పరామర్శించాం. రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు జైల్లో నరేందర్ రెడ్డి గారు శిక్ష అనుభవిస్తున్నారు.పట్నం నరేందర్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అత్యంత ధనవంతమైన పార్టీగా బీఆర్ఎస్ ..!

తమ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ.1,449కోట్లు ఉన్నట్లు బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో దేశంలోనే అత్యంత ధనవంతమైన పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. మరే ఏపార్టీకి కూడా ఇంత భారీ ఎత్తున నగదు లేదు. వైసీపీ ఖాతాలో కేవలం రూ.29కోట్లు ఉన్నట్లు నివేదికను సమర్పించింది. టీడీపీ ఖాతాలో రూ.272కోట్లు, డీఎంకే ఖాతాలో రూ.338కోట్లు, ఎస్పీ ఖాతాలో రూ.340కోట్లు,జేడీయూ ఖాతాలో రూ.147కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

మహారాష్ట్ర కొత్త సీఎంపై ఉత్కంఠ

మహారాష్ట్ర కొత్త సీఎంపై ఉత్కంఠ నెలకొన్నది.. సీఎం పదవిపై మహాయుతి కూటమిలో పోటాపోటీ ఉంది.. ఈరోజు ఉదయం వెలువడుతున్న మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 288స్థానాల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 220కి పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించింది.. మొత్తం 125 స్థానాలతో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా బీజేపీ అవతరించింది.. సీఎం రేసులో ముందున్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు.. మరోవైపు అజిత్‌ పవార్‌నే సీఎం చేయాలని ఎన్సీపీ వర్గం పట్టు పడుతుంది.. మహాయుతి గెలుపులో […]Read More