జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకే చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఘోర అవమానం జరిగింది. జిల్లాలో గుర్లలో అతిసార వ్యాధితో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కూటమి ప్రభుత్వం యొక్క వైపల్యం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది అని ప్రజలు తీవ్ర ఆగ్రహాం తో ఉన్నారు. అతిసార వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలను.. మృత్యువాత పడిన వారి కుటుంబ […]Read More
ఈరోజు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కేరళ వెళ్లనున్నారు. త్వరలో జరగనున్న వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు ప్రియాంకా గాంధీ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో రేపు బుధవారం ఆమె నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నరు. అందుకే ఈ రోజు సాయంత్రం ఆయన కేరళకు బయలు దేరనున్నారు. బీజేపీ తరపున నవ్య హరిదాస్ […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతల్లో అప్పుడే అంతర్మధనం మొదలైందా..?. అధికారంలోకి రాలేమనుకున్నవాళ్ళు తీరా అంచనాలన్నీ తలకిందులై అధికారంలోకి వచ్చాక ఏమి చేయాలో ఆర్ధం కావడం లేదా..?. కనీసం నలబై యాబై సీట్లు వస్తాయేమో అని గంపగుత్త హామీలిచ్చి తీరా ఇప్పుడు వాటీని అమలు చేయాలంటే తలలు పట్టుకుంటున్నారా..?. గత మూడు నాలుగు నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇటీవల పార్టీలో చేరి మంత్రులైన కొంతమంది నేతల తీరుతో ఆ పార్టీకి నష్టం […]Read More
పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పాలనలో కనీసం ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.. గ్రూప్ – 1 అభ్యర్థులను బీఆర్ఎస్ తమ రాజకీయాల కోసం వాడుకున్నారు. సిగ్గులేకుండా రోడ్లపైకి వచ్చారు అని టీపీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే యాబై వేల ఉద్యోగాలిచ్చాము.. గ్రూప్ -1 నిర్వహిస్తున్నాము.. మెగా డీఎస్సీ వేసి పోస్టులను భర్తీ చేశాము. పదేండ్ల తమ […]Read More
తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉండే నందినగర్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.. ఉదయం నుండే భారీగా పోలీసులు అక్కడ మోహారించారు. ఈరోజు సుప్రీం కోర్టులో గ్రూప్ -1 పై విచారణ జరుగుతుంది. మరోవైపు మధ్యాహ్నాం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వారిని కలుస్తారనే సమాచారంతో కేటీఆర్ ను హౌజ్ అరెస్ట్ చేశారని […]Read More
గ్రూప్ -1 అభ్యర్థుల పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టులో చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. జీవో 29 వలన ఎస్సీ,ఎస్టీ ,బీసీ అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుంది. మెరిట్ లో ర్యాంకులు సాధించినవారికి రిజర్వేషన్ వర్తించడం అన్యాయమని గ్రూప్ -1 అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇప్పటికే హైకోర్టు కొంతమంది కోసం పరీక్షలు వాయిదా వేయలేమని తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. ఈ రోజు మధ్యాహ్నాం రెండు గంటల […]Read More
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఆ సమయంలో హీరో అల్లు అర్జున్ పై ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టు రేపు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో 144 […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత తన్నీరు హారీష్ రావుపై బేగం బజార్ పీఎస్ లో పిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పిషనరీ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని పీఎస్ లో పిర్యాదు చేశారు.Read More
ఏపీ లో ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు రియాల్టీ షోలో ఉన్నారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ‘ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యాడో గానీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడూ జరగలేదు. దీనికి కారణం ఈ అసమర్థ ప్రభుత్వం కాదా? వీకెండ్ వస్తే హైదరాబాద్ కు వెళ్లి లైఫ్ ఎంజాయ్ చేయాలనే ధోరణిలో నాయకులు ఉన్నారు’ అంటూ Xలో […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసు అమరవీరులకు అందించే పరిహారాన్ని ప్రకటించారు.విధుల్లో వీర మరణం పొందిన కానిస్టేబుల్ ,హెడ్ కానిస్టేబుల్ లకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వనున్నారు. సబ్ ఇన్ స్పెక్టర్లకు కోటి ఇరవై ఐదు లక్షలు పరిహారం ఇవ్వనున్నారు. డీఎస్పీ,అడిషనల్ ఎస్పీ, ఎస్పీ లకు కోటి యాబై లక్షలు.. ఐపీఎస్ లకు రెండుకోట్ల .. శాశ్వతంగా అంగవైకల్యం పొందిన వాళ్లకు యాబై లక్షలివ్వనున్నట్లు తెలిపారు. ముత్యాలమ్మ గుడి ఘటనలో […]Read More