Cancel Preloader

Month: August 2024

Andhra Pradesh Slider Top News Of Today

పెన్షన్ దారులకు శుభవార్త

ఏపీలోని ఆసరా పెన్షన్ లబ్దిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు ఇకపై ఆసరా పెన్షన్స్ కోసం సొంత ఊర్లకు రావాల్సిన అవసరంలేదు.. ఎందుకంటే ఉపాధి కోసం వేరే కారణాల వల్ల సొంత ఊర్ల నుండి ఇతర ఊర్లలో ఉంటున్నవారు తమ ఆసరా పెన్షన్స్ కోసం అడ్రస్ మార్చుకోవచ్చు.. ఈ ప్రక్రియను ఆసరా బదిలీ కార్యక్రమంలో చేయనున్నారు.. ఇందుకు అక్కడి అడ్రస్, పిన్ […]Read More

Movies Slider

బలగం మూవీకి అవార్డుల పంట

2024 ఫిలింఫేర్ అవార్డ్ విజేతలు ఉత్తమ చిత్రం: బలగం ఉత్తమ దర్శకుడు: వేణు ఎల్దండి (బలగం) ఉత్తమ నటుడు: నాని (దసరా) ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా) ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యూవ్ (హాయ్ నాన్న) ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): బేబి ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ) ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబి) ఉత్తమ సహాయ […]Read More

Slider Telangana Top News Of Today

అమెరికా చేరుకున్న రేవంత్ రెడ్డి

పది రోజుల పర్యటనలో భాగంగా అమెరికు బయలుదేరి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  న్యూయార్క్ విమానాశ్రయానికి చేరుకున్నారు.. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కి ఆయన  అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. మరోవైపు  ఈనెల 14 వరకు  అమెరికాలోని న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూజెర్సీలో పర్యటించనున్నారు. అనంతరం దక్షిణ కొరియాలో ఆయన పర్యటించనున్నట్లు తెలుస్తోంది.Read More

Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ భవనాన్ని కూల్చేయండి

తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న శనివారం నల్గొండ మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని నూతన భవన నిర్మాణం పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “2019లో నిబంధనలకు విరుద్ధంగా గజం వందరూపాయలకు ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని బీఆర్ఎస్ తమ పార్టీ కార్యాలయానికి నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు. అడ్డుకోకుండా ఏమి చేశారు.. నేను అమెరికా వెళ్తున్నాను.. ఈ నెల పదకొండు తారీఖున తిరిగి […]Read More

Movies Slider Top News Of Today

దేవర నుండి సర్ ఫ్రైజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘దేవర’ .. ఈ సినిమా నుంచి రేపు సెకండ్ సింగిల్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ పాటలోని ఓ చిన్న మ్యూజిక్ బీట్ ను చిత్రం మేకర్స్ రిలీజ్ చేశారు. పదాలు తగ్గినపుడు సంగీతమే మాట్లాడుతుందని ట్యాగ్ లైన్ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ ను […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

మాజీ ఎంపీ మార్గాని భరత్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎంపీ మార్గాని భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గత మా ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కర్కి అందాయి.. కరోనా సమయంలో వారి సేవలు మరువలేనివి.. వాలంటరీలకు పదివేల రూపాయల జీతం ఇస్తాము అని ఎన్నికల్లో హామీచ్చింది.. తీరా అధికారంలోకి వచ్చాక వాళ్ళను పట్టించుకున్న నాధుడే లేడు.. కొన్ని చోట్ల వాళ్ళను పక్కన పెట్టారు.. మరికొన్ని చోట్ల వాళ్లకు పైసలు […]Read More

Slider Telangana Top News Of Today

సాగు రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్కుంటున్నా రైతులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు రాబోయే రెండు నెలల్లోనే పట్టాలను అందజేయాలనీ సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఆయా భూములపై అధికారులు సర్వే చేసి రైతులకు పట్టాలను ఇవ్వాలని ఆయన కోరారు.. మొదటి విడతగా […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

కౌలు రైతులకు శుభవార్త

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో చట్టాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రద్ధు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్ధు చేయనున్నట్లు టీడీపీ సీనియర్ నేత.. మంత్రి కింజరాపు అచ్చెన్నయుడు ప్రకటించారు.. కౌలు రైతులకు మేలు చేసేలా త్వరలోనే మరో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని వారు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో కౌలు రైతులను సభ్యులుగా […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు శుభవార్తను తెలిపింది. గత ఎన్నికల్లో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆగస్టు 15నుండి అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.. వచ్చే ఐదెండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ తో నడిచే బస్సులను తీసుకొస్తాము.. గత ఐదు ఏండ్లలో వైసీపీ ప్రభుత్వం […]Read More

Slider Telangana Top News Of Today

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇరవై వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం ఖమ్మం జిల్లా  ముదిగొండ మండలం కమలాపురం లో ఆయన పర్యటించారు. మధిర నియోజకవర్గంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేస్తాము.. అంగన్ వాడిలో మూడో తరగతి వరకు ఏర్పటు […]Read More