Month: August 2024

Breaking News Hyderabad Slider

హైడ్రా దూకుడు-6గురు అధికారులపై కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని చెరువులు,కుంటలు,ప్రభుత్వ భూముల పరిరక్షణకై ఏర్పాటైన “హైడ్రా” దూకుడు పెంచింది. ఇందులో భాగంగా గతంలో FTL,బఫర్ జోన్ల నియమాలకు విరుద్ధంగా నిర్మాణాలకు,కట్టడాలకు అనుమతిచ్చిన జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలకు పూనుకుంది. ఈ క్రమంలోనే ఆరుగురు అధికారులపై కేసులను నమోదు చేసింది. నిజాంపేట మున్సిపల్ కమీషనర్,చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమీషనర్,హెచ్ఎండీఏ ఏపీఓ,బాచుపల్లి తహశీల్దార్,మేడ్చల్ జిల్లా సర్వే అధికారి ఇలా ఆరుగురిపై ఆర్ధిక నేర విభాగం(ఈఏఓ)లో పిర్యాదు చేసింది. వీరంతా నియమాలకు విరుద్ధంగా నిర్మాణాలకు,కట్టడాలను […]Read More

Breaking News Movies Slider Top News Of Today

సరికొత్తగా రష్మీక మందన్నా

హాట్ బ్యూటీ…నేషనల్ క్రష్ రష్మిక కొత్త జోనర్లోకి అడుగుపెట్టనుంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సరసన హారర్ మూవీలో నటించేందుకు ఆమె అంగీకారం తెలిపినట్లు టాక్. ఆదిత్య సర్పోల్దార్ దర్శకత్వం వహించే ఈ సినిమాకి ‘వాంపైర్స్ ఆఫ్ విజయనగర’ అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది బాలీవుడ్లో హారర్ నేపథ్య చిత్రాల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సైతాన్, ముంజ్యా హిట్ అందుకోగా స్త్రీ2 బాక్సాఫీసును షేక్ చేస్తోంది.Read More

Breaking News Movies Slider Top News Of Today

హీరో బాలకృష్ణ గురించి మీకు తెలియని విషయాలు..?

నందమూరి అందగాడు.. సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏండ్లు పూర్తి చేసుకున్న సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము.. బాలయ్య 17 సినిమాల్లో డ్యూయల్ రోల్, అధినాయకుడు చిత్రంలో ట్రిపుల్ రోల్ చేశారు.1987లో బాలయ్య నటించిన సినిమాలు ఏకంగా 8 రిలీజయ్యాయి. అవన్నీ హిట్టు కావడం మరో విశేషం. మొత్తం 71 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి.బాలయ్య 6 ఫిల్మ్ […]Read More

Breaking News National Slider Telangana Top News Of Today

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్

తెలంగాణలోని వరంగల్-కాజీపేట నాలుగో లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో సెప్టెంబర్ -అక్టోబర్ నెల మధ్యలో 94 రైళ్లను ఎంపిక చేసిన తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మొత్తం 41 రైళ్లను దారి మళ్లించనున్నారు..మరో 27 రైళ్ల ప్రయాణ సమయాలను మార్చింది.ఈ రెండు స్టేషన్ ల మధ్య ఫోర్ లైన్ నిర్మాణం జరుగుతుంది … దీంతో రద్దైన వాటిలో గోల్కొండ, శాతవాహన ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ, సికింద్రాబాద్-కాగజ్నగర్, విజయవాడ-సికింద్రాబాద్, భద్రాచలం రోడ్-బల్లార్ష […]Read More

Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

” హైడ్రా” కూల్చివేతలపై కేంద్ర మాజీ మంత్రి ఆవేదన

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు.. నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెల్సిందే.. సామాన్యుల దగ్గర నుండి సినీ రాజకీయ ఇలా రంగంతో సంబంధం లేకుండా FTL,బఫర్ జోన్లలో ఉన్న అక్రమ కట్టడాలను.. నిర్మాణాలను హైడ్రా నోటీసులు ఇచ్చి మరి కూల్చివేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు తన సోదరుడు ఆనంద్ కు చెందిన స్పోర్ట్స్ విలేజ్ ను హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేశారు. దీనిపై కేంద్ర మాజీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

దళిత కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఘోర అవమానం

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘోర అవమానం జరిగింది. నిన్న శుక్రవారం నల్గోండ (ఉమ్మడి)జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ పాల్గోన్నారు. ఈ క్రమంలో మంత్రులకు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను అక్కడున్న పోలీసు అధికారులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆవేశానికి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సెప్టెంబర్ 7 నుండి మద్యం దుకాణాలు బంద్

వచ్చే సెప్టెంబర్ నెల ఏడో తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించినట్లు ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రకటించారు. మద్యం దుకాణాల్లో పని చేసే కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వం తమను ఇంటర్వూ ద్వారా ఎంపిక చేసింది.ఇప్పుడు ఆ ఉద్యోగం ఊడిపోయేలా ఉంది అని వారు తెలిపారు. నూతన మద్యం పాలసీ […]Read More

Movies Slider Top News Of Today

సీక్రెట్ కెమెరాలతో హీరోయిన్ల నగ్న వీడియోలు చిత్రీకరణ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్.. నటి రాధిక శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ “హీరోయిన్ల కారవాన్లలో సీక్రెట్ కెమెరాలతో హీరోయిన్ల నగ్న వీడియోలను చిత్రీకరించేవారు. సినిమా షూటింగ్ సెట్ లోనే ఆ వీడియోలను కొంతమంది చూడటాన్ని గమనించేదాన్ని అని”ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులు కేవలం మళయాళం చిత్ర పరిశ్రమలోనే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. నేను సినిమా షూటింగ్ లో డ్రస్సులు మార్చుకోవడానికి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ప్రజలకు,కార్యకర్తలకు అండగా ఉంటాను

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం మాజీ మంత్రి.. నగరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీంటిని ఐదేండ్ల అధికారంలో ఉన్న సమయంలో నెరవేర్చాను.. నలబై నుండి యాబై ఏండ్లు ఎమ్మెల్యేగా.. అధికారంలో ఉండి సైతం అమలు చేయని కొంతమందిలా కాకుండా ఐదేండ్లలోనే నగరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాను. అధికారంలో ఉన్న […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి రాజకీయాలకు ఇది పరాకాష్ట

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గం. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయం. రేవంత్ రెడ్డి దివాళాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట.స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద 33 జిల్లాల్లో మంజూరైన సుమారు 10 వేల కోట్ల విలువ చేసే 34,511 పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శం. గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలను బయటపెట్టింది.రాష్ట్ర  […]Read More