టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య తన భార్య నటాషా నుంచి విడిపోవడానికి గల కారణాలు ఇప్పటికీ వారిద్దరూ వెల్లడించలేదు. అయితే హార్దిక్ ఆడంబరం, తన లైఫ్ స్టైల్ మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం విడాకులకు కారణమని వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందని టైమ్స్ నౌ పేర్కొంది. స్వతంత్రంగా ఉండాలనుకునే నటాషాకు, హార్దిక్ ‘లివింగ్ లైఫ్ కింగ్ సైజ్’ మెంటాలిటీకి మధ్య ఏర్పడిన గ్యాప్ విడాకులకు దారి తీసి ఉండొచ్చంది.Read More
CRIME :- జియో తమ యూజర్లకు బిగ్ అలర్ట్ ను తెలిపింది.. ఇందులో భాగంగా తమ పేరిట సైబర్ నేరగాళ్లు పంపుతున్న SMS లను నమ్మొద్దని యూజర్లకు జియో సూచించింది. కాల్, మెసేజ్, ఈ–మెయిల్ ద్వారా పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, ఓటీపీలు అడుగుతున్నారని పేర్కొంది. ఎలాంటి లింక్లు వచ్చినా క్లిక్ చేయొద్దంది. థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలని చెప్పినా కానీ పట్టించుకోవద్దని సూచించింది. సిమ్ కార్డ్ వెనుక ఉండే 20 […]Read More
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న రీరిలీజైన ‘ఇంద్ర’ సినిమా అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 3.05 కోట్లు వచ్చినట్లు వైజయంతి ఫిల్మ్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 385 థియేటర్లలో ఈ సినిమాను రీరిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, హీరోలు సైతం స్పెషల్ షోలకు హాజరై సందడి చేస్తున్నారు.Read More
Movies :- ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజు రవితేజ తన 75వ సినిమా చిత్రీకరణలో గాయపడినట్లుసినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ చిత్రీకరణలో కుడి చేతికి గాయం కావడంతో యశోదా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసినట్లు పేర్కొన్నాయి. రవితేజ కోలుకునేందుకు కనీసం 6 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అటు ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. RT75 చిత్రాన్ని భాను భోగవరపు అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.Read More
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల గృహాలకు నెలకు రూ.300కే ఫైబర్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు కేంద్ర టెలికం, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం కలిశారు. టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు […]Read More
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఈరోజు శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సమావేశంలో ఈమేరకు నిర్ణయించినట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ రేసులో పలువురి పేర్లు వినిపించినా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు వార్తలొస్తున్నాయి.Read More
Health :- వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగితే అనేక లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము…Read More
AP:- ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురితో సన్నిహితంగా ఉంటున్నారని ఆయన భార్య దువ్వాడ వాణి కొన్ని రోజులుగా ఆయన ఇంటి ముందు ఆందోళన చేస్తున్న సంగతి మనకు తెల్సిందే.. ఈ వార్త రెండు ఉభయ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఈ నేపథ్యంలో తన కుటుంబ వివాదంతో రచ్చకెక్కిన ఆయనకు వైసీపీ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ […]Read More
TS:- తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న వారికి జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నిన్న గురువారం డా.. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో అధికారులతో ఆయన విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో తాము ‘ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం ఇస్తాము . రేషన్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు ఉంటాయి. రేషన్ బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్ షిప్ రద్దు చేస్తాము […]Read More
Movies :- ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ‘ఓజీ’ సినిమా డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు. అమరావతిలోని ఆఫీసులో ఈ సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల సెప్టెంబర్ నుండి చిత్రీకరణ పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.Read More
