వినడానికి వింతగా ఉన్న ఇది నిజం..హర్యానా – కర్నాల్‌లోని నమస్తే చౌక్ సమీపంలో ఒకవైపు కుండపోత వర్షం కురుస్తుంటే అదే సమయంలో రోడ్డు మరమ్మత్తుల పనులను సిబ్బంది చేయడం విశేషం..Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం….బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఈరోజు సోమవారం కొట్టేసింది. గత పదేండ్లలో విద్యుత్ కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నియమ నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.Read More
ఏపీ డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈరోజు సోమవారం పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు… ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదని అన్నారు. మాట్లాడుతూ.. ‘జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నాను. కానీ శాఖలో డబ్బులు లేకపోవడం, వేల కోట్ల అప్పులు చూసి ఎమ్మెల్యేగా జీతం వద్దని చెప్పాను. క్యాంప్ ఆఫీసులో మరమ్మత్తులో ఏమైనా చేయాలా అని అడిగితే వద్దన్నాను. కొత్త […]Read More
తెలంగాణ సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా స్కూళ్లల్లో టీచర్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా 0-10 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఒకరు, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న స్కూళ్లకు ఇద్దరు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ముగ్గురు, 61కి పైగా విద్యార్థులున్న స్కూళ్లకు గతంలో మాదిరిగానే టీచర్లను కేటాయించనుంది. అయితే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా కేటాయింపు చేపట్టనున్నట్లు తెలుస్తుంది..Read More
టీ20 వరల్డ్ కప్ను టీమిండియా గెలుపొందడంపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ రికార్డు సృష్టించింది. వరల్డ్ కప్, టీమ్ సభ్యులతో ఉన్న ఫొటోలతో ‘ఇంతకంటే మంచి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అని కోహ్లీ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఇప్పటివరకు 18 మిలియన్ల లైకులతో పాటు 6.6 లక్షల కామెంట్స్ వచ్చాయి. గతంలో కియారా, సిద్ధార్థ్ పేరిట ఉన్న రికార్డును సైతం […]Read More
ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం తెలుగు రాష్ట్రాలకు మరో మూడు రోజులు వర్షాలు పోలవరంలో రెండోరోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన హైదరాబాద్ లో పీవీ హైవేపై కారు బీభత్సం, ఒకరు మృతి 6 నుంచి 15 వరకు ఇంద్రకీలాద్రిపై వారాహి నవరాత్రులు నేటి నుంచి అమలులోకి కొత్త క్రిమినల్ చట్టాలు మథురలో కూలిన వాటర్ ట్యాంక్, ఇద్దరు మృతి దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీ మిషన్ గడువు పొడిగింపు ముంబై: బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హాకు అస్వస్థత […]Read More
ఏపీ లో పెన్షన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తాడేపల్లి(మ) పెనుమాకలోని ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం పెన్షన్ అందించారు. రాష్ట్రం వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉ.6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ అందిస్తున్నారు. దాదాపు ఇవాళే పెన్షన్ పంపిణీని పూర్తి చేయాలని సీఎస్ నీరభ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఇదే గ్రామంలో మంత్రి నారా లోకేష్ నాయుడు కూడా […]Read More
తెలంగాణ లోని గ్రూప్స్ అభ్యర్థుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల ట్రాప్ లో నిరుద్యోగులు పడొద్దని సూచించారు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వెంకట్ తెలిపారు. నిన్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్తో బల్మూరి చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది.Read More
బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెల్సిందే.. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూర్చుస్తోంది.. బస్వరాజ్ సారయ్య […]Read More