ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఈ రాత్రికి రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీల విందులో పాల్గొననున్నారు. రేపు ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలతో అయన భేటీ కానున్నారు. అమరావతి, పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు.Read More
తెలంగాణ లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ కు దిష్టి పోయిందని మాజీ సీఎం.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఫామ్ హౌస్ లో మహబూబాబాద్, నల్గొండ పార్టీ శ్రేణులతో సమావేశమైన అయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ మోసం భరించలేక ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. త్వరలోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాదరణ కూడగట్టాలి. ఈసారి మనమే అధికారంలోకి రాబోతున్నాం’ అని ఆయన […]Read More
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ … ఐపీఎస్ గౌతమ్ సవాంగ్ తన పదవికి ఈరోజు బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేశారు. సవాంగ్ అందజేసిన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్ తక్షణమే ఆమోదించారు.నాటి ప్రభుత్వంలో ఉన్న వైసీపీ హయాంలో 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఈయన డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉండి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా […]Read More
రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. ఆశ్వనిదత్తు నిర్మాతగా… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్ పై… దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, శోభన లాంటి హేమహేమీలు నటించగా జూన్ 27న సినీ అభిమానుల ముందుకు వచ్చిన మూవీ కల్కి 2898AD .. మొదటిరోజే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగుతోంది. గత 6 రోజుల్లోనే రూ. 700 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, విజయ్ ‘లియో’, […]Read More
మాజీ ఉపప్రధాని… బీజేపీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు..ఆయనకు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ వినిత్ సురి ఆధ్వర్యంలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 96 ఏళ్ల అద్వానీ ఆరు రోజుల క్రితం కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స అందించిన సంగతి తెల్సిందే .Read More
రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన అటునుంచి పదేండ్ల […]Read More
యూపీలోని హత్రాస్ లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 100 మంది మృతి చెందారు. వంద మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది…Read More
ఏపీలోని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేద కుటుంబం నుండి వచ్చిన సంగతి తెల్సిందే.. 2019లో ఓడిన అయన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.. అయితే అతని దగ్గర నియోజకవర్గంలో తిరగడానికి కారు లేకపోవడంతో జనసైనికులు ఫార్చునర్ కారును బహుమతిగా ఇచ్చారు. నియోజకవర్గ జనసైనికులు అందరూ కలిసి 10 లక్షలు విరాళాలుగా పోగేసి, డౌన్ పేమెంట్ కట్టి ఫార్చునర్ కారును ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు ఇచ్చారు. మిగిలిన డబ్బును నెలనెలా ఈఎంఐ రూపంలో […]Read More