Month: June 2024

National Slider Top News Of Today

లోక్ సభ విపక్ష నేతగా రాహుల్ గాంధీ

ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240స్థానాలతో అతి పెద్ద పార్టీ గా అవతరించగా 99స్థానాలతో రెండో పెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ తమ కూటమి పార్టీ సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు జరిగిన ఇండియా కూటమి సమావేశంలో లోక్ సభ లో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ని నియమించాలని తీర్మానం తీసుకున్నారు. దాదాపు పడేండ్ల తరువాత లోక్ సభలో విపక్ష నేత ఎన్నికవడం గమనార్హం.Read More

Andhra Pradesh Slider Top News Of Today

జూలై 1న పిఠాపురం లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జూలై 1న తారీఖున డిప్యూటీ ముఖ్యమంత్రి.. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక అధికారులతో సమావేశమై నియోజకవర్గంలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. వారహి సభలో పాల్గొని పిఠాపురం ప్రజలకు ధన్యవాదములు చెప్పనున్నారు.Read More

Slider Telangana Top News Of Today

మంత్రి తుమ్మలకు షాక్

రైతు భరోసా పథకం పై అభిప్రాయ సేకరణ పేరిట తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఈరోజు మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, కిసాన్ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోదండ రెడ్డి, చిన్నారెడ్డి లు ఈ రోజు మాట్లాడారు. మొదటగా గతంలో తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరు నుండి రైతులు మాట్లాడుతూ అయితే 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాన్ని  […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

స్పీకర్ కి జగన్ లేఖ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి లేఖ రాశారు..ఆ లేఖలో మొన్న జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధంగా ఉంది.. సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉన్నారు.. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు.. […]Read More

Slider Telangana Top News Of Today

గాంధీలో రెండో రోజు జూడాలు సమ్మె

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో జూడాలు వరుసగా రెండో రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు.. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె.. డ్యూటీలు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి మరి జూడాలు నినాదాలు . తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు తాము సమ్మె విరమించేది లేదని గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ వంశీకృష్ణ ఈసందర్భంగా తెలిపారు.Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ తీరుపై కాంగ్రెస్ నేతలు అసహానం..?

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ,కడియం శ్రీహారి ,పోచారం శ్రీనివాస్ రెడ్డి,సంజయ్ కుమార్ లను స్థానిక కాంగ్రెస్ నేతలకు సంబంధం లేకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కల్సి […]Read More

Slider Telangana Top News Of Today

జీవన్ రెడ్డి కంటతడి

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత..ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి కంటతడిపెట్టారు..ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ వాపోతున్నారు.. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరిపై కంటతడి పెట్టారు..కాంగ్రెస్ మానిఫెస్టోలో ఎమ్మెల్యే పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తామని పెట్టి, ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకుంటారు అని ఆవేదనను వ్యక్తం చేశారు. Video Credits – TV9Read More

Slider Telangana Top News Of Today

జీవన్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి బుజ్జగింపు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెల్సిందే. దీంతో సీనియర్ నేత  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కల్సి హైదరాబాద్ లోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి బుజ్జగించే పనిలో పడ్డారు. ఈసందర్భగా పార్టీకి..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయద్దని..పార్టీలో ఉండాలని.. అత్యున్నత స్థానం ఇస్తామని […]Read More

Crime News Slider

అదుపు తప్పి వాగులో పడ్డ కారు

నిజామాబాద్ – పడగల్ గ్రామానికి చెందిన గాదెపల్లి రమేశ్ (56) అనే వ్యక్తి వేల్పూర్ మండలంలో కాలువ కట్టపై కారును రివర్స్ తీసే ప్రయత్నంలో కారు అదుపుతప్పి కట్టపై నుంచి మత్తడి వాగులో పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ వినయ్ కుమార్ అగ్నిమాపక సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మత్స్యకారుల సహాయంతో కారును వెలికి తీయించి. కారులోని రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.Read More

Editorial Slider Telangana Top News Of Today

ఏ వెలుగులకో ఈ ఫిరాయింపులు ?!

ఆరు దశాబ్దాల తెలంగాణ కలను 14 ఏండ్ల సుధీర్ఘ పోరాటంలో అవమానాలు, అవహేళనలు, రాజీనామాలు, రాజకీయ ఎత్తుగడలు, ఎన్నో ఉత్తాన పత్తానాలను ఎదుర్కొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు. తెచ్చుకున్న తెలంగాణలో 63 స్థానాలు గెలుచుకుని అధికార పీఠం అందుకున్నారు. ఓటుకునోటు లాంటి ఘటనలతో తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలి అంటే కుట్రలను కూలదోయాలి. రాజకీయ పునరేకీకరణతోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని భావించి ఇతర పార్టీల నుండి చేరికలను ప్రోత్సహించారు. రాజకీయ అనిశ్చితి ఉంటే తెలంగాణ మీద […]Read More