Month: June 2024

Slider Telangana Top News Of Today

కేంద్ర మంత్రి నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన బ‌కాయిలు రూ.693.13 కోట్లు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. న‌డ్డా గారికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జె.పి. నడ్డా గారిని కలిసి వైద్యా ఆరోగ్య రంగంపై తెలంగాణ ప్ర‌భుత్వం పెడుతున్న ప్ర‌త్యేక చర్యలను వివ‌రించారు. ఆరోగ్య మిషన్ 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు పెండింగ్‌లో ఉండటమే కాకుండా 2024-25 […]Read More

Slider Sports Top News Of Today

ఓపెనర్ గా కోహ్లీ ఫెయిల్

టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల మిషన్..కింగ్ విరాట్ కోహ్లీ ఓపెనర్ గా ఫెయిలైనట్లే అని ఆర్ధమవుతుంది.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో   కోహ్లి తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. విరాట్ కోహ్లీ కి  ఓపెనింగ్ కలిసి రావడం లేదనేది క్రికెట్ మరియు కోహ్లీ అభిమానుల వాదన. ఐపీఎల్ లో ఓపెనర్ గా రాణించారు.. కానీ మెగా టోర్నీలో మాత్రం కింగ్ తేలిపోతున్నారని కొందరు అంటున్నారు. ఈ టోర్నీలో విరాట్ 2సార్లు డకౌట్, 2 సార్లు సింగిల్ డిజిట్ […]Read More

Slider Telangana Top News Of Today

జూలై మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై మొదటి వారంలో  ఉండనున్నట్లు గాంధీభవన్ లో వినికిడి. ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్,రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్, రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ మంత్రి పదవుల రేసులో ఉన్నట్లు టాక్.ఇటీవల పార్టీపై నిరసన గళం విన్పిస్తున్న […]Read More

National Slider Top News Of Today

NDA స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా

ఎన్డీఏ కూటమి స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా ను ఎంపిక చేశారు ప్రధానమంత్రి నరేందర్ మోదీ.. 61ఏండ్ల ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికవ్వడం లాంఛనమే.. ఒకవేళ ఎన్నికైతే రెండు సార్లు ఆ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తిగా ఆయన నిలుస్తారు.. ఇందులో బలరాం ఝాఖడ్ మాత్రమే పదేండ్ల పదవికాలంలో ఉన్నారు.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఓం బిర్లా మూడు సార్లు ఎంపీగా గెలిచి లోక్ సభలో అడుగు పెట్టారు.. రాజస్థాన్ కు  చెందిన నేత..బీజేపీ […]Read More

Slider Telangana Top News Of Today

కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ జాప్యంపై ప్రభుత్వానికి హైకోర్టు అంక్షితలు

తన నియోజకవర్గమైన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడంలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుంది. లబ్ధిదారులకు సకాలంలో చెక్కులను అందజేయకపోతే వాటి గడవు ముగిస్తే ఏమి చేస్తారని ..తగిన వివరాలను అందజేయాలని అంక్షితలు వేస్తూ విచారణను బుధవారం రోజుకు వాయిదా వేసింది..Read More

Slider Telangana Top News Of Today

రామగుండంలో 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం

కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉన్న పాత 62.5 మెగా విద్యుత్ కేంద్రం స్థానంలో 800మెగావాట్ల అత్యాధునీక విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.. మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పార్టీ ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్,విజయరమణారావు,ప్రేమ్ సాగర్ రావు, విప్ లు ఆది శ్రీనివాస్,అడ్లూరి లక్ష్మణ్, డిప్యూటీ సీఎం భట్టిని కల్సి వినతి పత్రం అందించారు.. ఈ సందర్భగా భట్టి మాట్లాడుతూ ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ఎన్టీపీసీ […]Read More

Slider Telangana Top News Of Today

రికార్డుకెక్కిన ఒవైసీ

తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువసార్లు లోక్ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఒవైసీ చరిత్రకెక్కారు. ఆయన 2004నుండి వరుసగా ఐదు సార్లు హైదరాబాద్ పార్లమెంట్ నుండి గెలుపొందారు. కాంగ్రెస్ ఎంపీ  మల్లు రవి (1991,1998,2024),గోడం నగేష్ (2014,2024),బీజేపీ ఎంపీ..కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి (2019,2024),కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కర్ (2009,2024),బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (2019,2024),బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (2014,2024),బలరాం నాయక్(2009,2024) రెండు సార్లు లోక్ సభ […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణ అభివృద్ధికి సహాకరించండి

కేంద్రమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో కల్సి అభినందనలు తెలిపారు.. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కిషన్ రెడ్డిని సత్కరించి సన్మానించాము.. తెలంగాణ అభివృద్ధికి సహాకరించాలని కోరినట్లు మంత్రులు తెలిపారు.Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఎంపీలకు టీడీపీ విప్

లోక్ సభ స్పీకర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఎంపీలంతా పాల్గోనాలని టీడీపీ విప్ జారీ చేసింది.. ఈరోజు ఉదయం బుధవారం పదకొండు గంటల నుండి సభలో ఉండాలి..ఎన్డీయే సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలి అని సూచిస్తూ మంగళవారం పార్టీ చీఫ్ విప్ హారీష్ బాలయోగి విప్ జారీ చేశారు.. మరోవైపు బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు ఓటింగ్ పై అవగాహన కల్పించనున్నారు టీడీపీ నేత శ్రీకృష్ణదేవరాయలు..Read More

Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా

మాట వరుసకైన తనను సంప్రదించకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ..సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఎంత బుజ్జగించిన సరే ఆంగీకరించే పరిస్థితుల్లో నేను లేనని వాళ్లకు తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి.. అవసరమైతే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను.. అందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ […]Read More