Month: June 2024

Andhra Pradesh Slider Top News Of Today

పవన్ కీలక ఆదేశాలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి…జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు.. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు సైన్స్ & టెక్నాలజీలో ఉన్న ప్రతిభను వెలికితీసేలా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలని  సంబంధితాధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా ఆయా అధికారులు  కార్యక్రమాలను చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సైంటిస్టులుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సి ఉందని డిప్యూటీ సీఎం పవన్  చెప్పారు. అంతేకాకుండా రాజమండ్రి ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రాన్ని త్వరలోనే […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణ స్వప్నికుడు జయశంకర్

తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి రేపు జూన్ 21న  శుక్రవారం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  జయశంకర్ సారూను స్మరించుకున్నారు. తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాడు సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని ఈసందర్బంగా […]Read More

Slider Telangana Top News Of Today

అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణ రావు ఈరోజు హైదరాబాద్ మహానగరంలోని హిమాయత్ నగర్ టూరిజం ప్లాజాను సందర్శించారు. ఈసందర్బంగా హిమాయ‌త్ న‌గ‌ర్ ప‌ర్యాట‌క భ‌వ‌న్‌ను పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో  అక్కడున్న హాజ‌రు ప‌ట్టిక‌, బ‌యోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరిగ్గా స‌మ‌యపాల‌న పాటించ‌క‌పోవ‌డం, హాజ‌రుశాతం తక్కువ‌గా ఉండ‌టంపై మంత్రి జూపల్లి ఆగ్రహించారు. ప్రతీ ఫ్లోర్ తిరిగి ఉద్యోగులు, సిబ్బంది […]Read More

Slider Sports

భారత్ స్కోర్ 181/8

T20 వరల్డ్ కప్  సూపర్-8లో ఈరోజు జరుగుతున్న అఫ్గాన్ స్థాన్ జట్టుపై భారత్ 20 ఓవర్లలో 181/8 స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 28 బంతుల్లో 53 పరుగులతో (3 సిక్సులు, 5 ఫోర్లు) రాణించారు. మరోవైపు రోహిత్ శర్మ 8,విరాట్ కోహ్లి 24,రిషబ్ పంత్ 20, శివమ్ దూబే 10, హార్దిక్ పాండ్య 32, అక్షర్ పటేల్ 12 రన్స్ చేశారు. అఫ్గాన్ బౌలర్లలో […]Read More

Andhra Pradesh Slider

కేంద్ర మంత్రి బీజేపీ వర్మ కీలక వ్యాఖ్యలు

కేంద్ర బొగ్గు భారీ పరిశ్రమల సహాయక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భూపాతీరాజు శ్రీనివాస వర్మ తొలిసారిగా భీమవరం వచ్చారు. ఈసందర్బంగా అయన మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన ఏ ఒక్కర్ని మరిచిపోను. అందర్నీ గుర్తుపెట్టుకుంటాను. రాష్ట్ర దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను. నలభై ఏండ్లుగా ఎంతోమంది దగ్గర పని చేశాను. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తను అన్ని విధాలుగా ఆదుకుంటాను. కష్టపడే కార్యకర్తకు […]Read More

Slider Telangana Top News Of Today

BRS MLA సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కి చెందిన పఠాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అతని సోదరుడు మధుసూధన్ రెడ్డి ఇండ్లపై ఉదయం నుండి ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈడీ దాడుల గురించి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష్యతోనే దాడులు నిర్వహించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుమ్మకై మాపై ఈడీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎందుకు పనికిరాని జిరాక్స్ పేపర్లు తప్పా ఏమి దొరకలేదు. మా ఇంట్లో […]Read More

National Slider

ఢిల్లీ సీఎం కి బెయిల్

ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టులో ఆప్ అధినేత…ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీ వాల్ అరెస్ట్ అయిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఈ కేసులో న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది.Read More

National Slider Top News Of Today Videos

మోదీ కారుపై చెప్పులు

యూపీలోని  వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ  భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేందర్ మోదీ కూర్చున్న బుల్లెట్ ప్రూఫ్ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పును విసిరిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన SPG అధికారి కారుపై ఉన్న చెప్పును తొలగించారు. నిన్న రోజంతా వారణాసిలో పర్యటించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ.. కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని గంగా హారతిలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.Read More

Jobs National Slider

నిరుద్యోగ యువతకు శుభవార్త

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది నిజంగా శుభవార్తనే..రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ల పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు ఆర్ఆర్బీ ప్రకటించింది. ముందుగా మొత్తం 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఆర్ఆర్బీ..  తాజాగా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో 1,364 పోస్టులు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అయింది.. అయితే జులై-ఆగస్టులో CBT-1 పరీక్ష ఉండనుంది. పూర్తి వివరాలకు https://www.rrbcdg.gov.in/ .Read More

Slider Telangana

హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో తొలిసారిగా గనులు వేలం వేసేందుకు కేంద్ర గనుల శాఖ రెడీ అయింది. ఈనెల 21న బొగ్గు గనులు వేలం వేసేందుకు  సర్వం సిద్దం చేశారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ వేలానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హాజరు కావాలని  కేంద్ర గనుల శాఖ కోరినట్లు సమాచారం..Read More