టీడీపీలోకి వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi’s remand extended..!
3 total views , 1 views today
వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. పూర్వపు టీడీపీ నేత అయిన వల్లభనేని వంశీ తిరిగి తన సొంత గూటికి చేరుతున్నారా..?… గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వంశీ అనుచరులు ఇలా ప్రచారం చేసుకుంటున్నారా..?. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డను కాదని ఏకంగా ముఖ్యమంత్రి…. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారా..?.
అంటే అవుననే అంటున్నాయి గన్నవరంలో జరుగుతున్న ప్రచారాలు.. వంశీ అనుచరులు తాము త్వరలోనే టీడీపీలో చేరుతున్నాము. అందుకుతగ్గట్లు వల్లభనేని వంశీ మోహాన్ వ్యూహారచనలు చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై స్థానిక టీడీపీ వర్గాలు ఖండిస్తున్నాయి.
స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డతో కల్సి చంద్రబాబు ను కల్సి వంశీ చేరికను అడ్డుకుంటామని అంటున్నారు. చూడాలి మరి వంశీ పై వస్తున్న వార్తలు నిజమో..?.. కాదో …?కాలమే సమాధానం చెప్పాలి.
