కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..?. రారా…?

 కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..?. రారా…?

Loading

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ఎన్నికల తర్వాత మూడు.. నాలుగు సార్లు తప్పా ఎక్కువగా అసెంబ్లీకి వచ్చింది. మరి ఇంకో మూడున్నరేండ్లు ఉన్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గోంటారా..?.

ఎందుకు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదనే అంశాల గురించి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నాలుగు దశాబ్ధాలుకు పైగా రాజకీయంలో ఉన్నారు.

కేంద్ర మంత్రి తో సహా అన్ని పదవులను ఆయన అనుభవించారు. నిత్యం జనాలకే సేవ చేయాలని ఆరాటపడతారు. అలాంటి కేసీఆర్ ను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కేసీఆర్ ను బండభూతులు తిట్టడం ప్రారంభించారు.

ఆయనకు కాకపోయిన ఆయన వయసుకు అయిన మర్యాద ఇవ్వాలి కదా. ఆ దూషణలు వినడానికి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలా అని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రిగానే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అడుగు పెడతారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *