2028లో సీఎం కేసీఆరా..? కేటీఆరా..?

తెలంగాణ రాష్ట్రంలో మూడేండ్ల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.
మహిళల నుండి రైతుల వరకూ.. ఉద్యోగుల నుండి యువత వరకు అన్ని వర్గాల ప్రజలు మళ్లీ కేసీఆర్ ను కోరుకుంటున్నారు. కేసీఆరే సీఎం గా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అని ఇటు బీఆర్ఎస్ శ్రేణులు. అటు కేటీఆర్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ మంత్రి హారీష్ రావు భవిష్యత్తు సీఎం ఎవరో క్లారిటీచ్చారు. కేసీఆర్ వారసులు ఎవరూ..?. కాబోయే సీఎం ఎవరూ అని అడిగిన ప్రశ్నకు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సమాధానమిచ్చారు.
ఆయన మాట్లాడుతూ కేసీఆరే మా నాయకుడు. కాబోయే సీఎం కేసీఆరే. కేసీఆర్ మాకు ఏ బాధ్యత అప్పజెబితే ఆ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తాము.. నేను కార్యకర్తను.. ఉద్యమనాయకుడ్ని .. ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తా అని ఆయన క్లారిటీచ్చారు.
