బీఆర్ఎస్ కు ఉద్యమకారులు షాక్..!

 బీఆర్ఎస్ కు ఉద్యమకారులు షాక్..!

Loading

బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల జేఏసీ బిగ్ షాకిచ్చింది. తెలంగాణ ఉద్యమ కారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి మీడియాతో మాట్లాడుతూ రేపు ఇరవై ఏడో తారీఖున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను బహిష్కరించాలని జాక్ పిలుపునిచ్చిందని తెలిపారు.

పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐ అధికారులతో విచారణ చేయించాలి. కేసీఆర్ కుటుంబం పదేండ్ల పాటు అక్రమంగా సంపాదించిన ప్రజా సొమ్మును స్వాధీనం చేసుకోవాలని జాక్ తరపున డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అంతేకాకుండా రాష్ట్ర సాధనలో పోరాడిన ఉద్యమ కారులపై పెట్టిన ఉపా వంటీ కేసులను ఉపసంహరిం చుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమ కారులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *