రైతుకు మద్ధతుగా మాజీ మంత్రి హారీష్ రావు

 రైతుకు మద్ధతుగా మాజీ మంత్రి హారీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యానికి మెదక్ జిల్లాకు చెందిన సంతోష్ (8309981132) అనే రైతు కష్టాలే నిదర్శనం.
మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్ గ్రామానికి చెందిన సంతోష్.. సిద్దిపేట జిల్లా గాగులాపూర్ అన్నపూర్ణ రైస్ మిల్లుకు వారి గ్రామం నుండి ఐదు లారీలు వడ్లను పంపారు. పంపి ఐదు రోజులైనా ప్రభుత్వం కొనడం లేదు.

అధికారులు జాప్యంతో ధాన్యం మొలకెత్తింది. ఇప్పుడు కొనడం సాధ్యం కాదని తిరిగి తీసుకెళ్లండి అని కొనడానికి నిరాకరిస్తున్నారు. సంతోష్ కాళ్లావేళ్లా పడితే లారీకి 50 బస్తాలు తరుగుతీస్తేనే కొంటామని, లేకపోతే కొనమని నిర్లక్ష్యంగా చెబుతున్నారు.

ఐదు రోజులుగా డ్రైవర్లకు భోజన వసతి సదుపాయాల ఖర్చును సంతోష్‌తోపాటు గ్రామస్తులు భరిస్తున్నారు. ప్రభుత్వం మొలకెత్తిన వడ్లను కొంటామని చెబుతున్నా అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆయన నాకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు.

మెదక్ జిల్లా కలెక్టర్ గారు, సిద్దిపేట కలెక్టర్ గారు సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి సంతోష్ సమస్యను పరిష్కరించాలి అని మాజీ మంత్రి హారీష్ రావు మీడియా సాక్షిగా డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *