విద్యాశాఖ మంత్రే లేడు.. వైద్యశాఖ మంత్రి ఏమి చేస్తుండో తెల్వదు..?
ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థులను మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు పరామర్శించారు.
రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. 11 నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
పిల్లల ప్రాణాల కంటే ఏది ముఖ్యమని ప్రశ్నించారు. ఒకపక్క పిల్లల ప్రాణాలు పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో చలన లేదు. అధికారంలోకి వచ్చి పది నెలలైన విద్యాశాఖ మంత్రే లేడు.. వైద్య మంత్రి ఏమి చేస్తుండో తెల్వదని హెద్దేవా చేశారు.