రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల లోక్ సభ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే.. కొత్తగా రేషన్ కార్డుల జారీ అంశం గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు..
వాటిని మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో వివరిస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా అర్హులైన నిరుపేదలకు ఎవరికైన ఇల్లు లేకపోతే వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు.
‘అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం. ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తాం. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం’ అని ఆయన హామీ ఇచ్చారు.