హైడ్రా ద్వారా హైకోర్టు ఓ సందేశం-అధికారులు గీత దాటితే..!
ప్రభుత్వాధి కారి అంటే ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య వారధి.. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైన.. అమలు చేసే ఏ కార్యక్రమమైన చిట్టచివరి వర్గాల వరకు అందరికీ అందాలంటే ప్రభుత్వాధికారులు నిక్కస్ గా.. నియత్ తో పనిచేయాలి. అప్పుడే ఆ ప్రభుత్వం చేపట్టిన పథకమైన.. కార్యక్రమమైన విజయవంతమ వుతుంది . అయితే తాజాగా హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వాధికారులకు ఓ సందేశమిస్తున్నట్లు ఆర్ధమవుతుంది.అమీన్ పూర్ కూల్చివేతలపై హైకోర్టులో పిటిషన్ గురించి విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు స్థానిక ఎమ్మార్వో మీకు కోర్టు ఆదేశాలను చదివేంత టైం ఉండదు.. కానీ కూల్చివేతలకు మాత్రం సమయం ఉంటుందా..?. సెలవు రోజుల్లో కూల్చివేతలు వద్దు అని కోర్టు సూచించిన కానీ మీరేందుకు ముందుకెళ్లారు.
విచారణలో ఉండగా ఎలా కూల్చివేస్తారు.. వ్యవస్థలంటే మీకు భయం లేదా..?. అంటే ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేశాము అని సదరు అధికారి సమాధానం ఇచ్చారు. దీనిపై కోర్టు అంటే ప్రభుత్వ పెద్దల .. రాజకీయ నేతల మెప్పుకోసం చార్మీనార్ ను కూల్చివేయమంటారు.. గోల్కోండ కోటను కూల్చివేయమంటారు.. కూల్చివేస్తారా..?. మీ పొలిటికల్ బాసుల కోసం మీరు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదు.అసలు చట్టం చెప్పేది ఏంటి.. మీరు చేస్తుంది ఏంటి.. అంటూ తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసింది. అసలు నిర్మాణాలను కూల్చడానికి మీకు ఉన్న అర్హత తెలపాలి. కూల్చివేతలపై మీ దగ్గర ఉన్న పాలసి చూపించాలి.మీ పనులను గతంలో హైకోర్టు అభినందించింది.. కానీ.. ఆదివారం కూల్చివేతలు సరైనవి కాదు.
ఆదివారం కూల్చివేతలు చేపట్టవద్దని ఇదే హై కోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియదా?.కలెక్టర్ చెబితేనే చర్యలు తీసుకున్నామని కోర్టుకు తెలిపిన అమీన్ పూర్ తహసీల్దార్.కలెక్టర్ ఆదివారం కూల్చమని చెప్పాడా అని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వాధికారులకు హైకోర్టు ఓ సందేశం ఇచ్చినట్లైంది. ప్రభుత్వం మారినప్పుడు ఆయా ప్రభుత్వ పెద్దలకు అనుగుణంగా పని చేయడం ప్రభుత్వాధికారులకు పరిపాటే. కానీ పని చేసే ముందు తాము చట్టాలకు లోబడి పని చేస్తున్నామా..?. లేదా చట్టాలను అతిక్రమించి పని చేస్తున్నామా అనేది ఆలోచించాలి. ట్రిబునల్ లా ప్రకారం చెరువులు,కాలువలు, నదులు,సరస్సుల పక్కన నియమనిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉండాలి.. అలా లేకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ నలబై ఎనిమిది గంటలు సమయమిచ్చి దానికి ముందే కూల్చివేయడం చట్ట విరూద్ధం..
సామాన్యులే కదా .. వాళ్లు శని,ఆదివారం ల్లో కోర్టులకు వెళ్లలేరు అని ప్రభుత్వ మెప్పుల కోసం ముందుకెళ్తే కోర్టులుంటాయి.. వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుందని సోమవార హైకోర్టులో జరిగిన విచారణ చెబుతుంది. రాజకీయ నేతల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారని.. చంచల్ గూడ, చర్లపల్లికు పంపిస్తే తెలుస్తుందంటూ హై కోర్ట్ పేర్కొనడం… అఖరికి హైడ్రా కమీషనర్ ను సైతం హైకోర్టు హాడలెత్తించిందంటే హైడ్రా వ్యవస్థ ఎలా నియమనిబంధనలను తుంగలో తొక్కి ముందుకెళ్తుందో ఆర్ధమవుతుంది.
అందుకే ఏ అధికారి అయిన సరే నియమనిబంధనలకు చట్టాలకు లోబడి పని చేయాలి.. కాదు కూడదని పని చేస్తే పక్క రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఐదారుగురు ఐపీఎస్ అధికారులను ఏకంగా సస్పెండ్ చేసినట్లు సస్పెండ్ అవుతారనే సందేశాన్ని హైడ్రా ద్వారా ఆర్ధమవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావులు ప్రభుత్వాధికారులను మీరు చట్టాలకు లోబడి పని చేయాలి.. కాదు ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అతిక్రమిస్తే చట్టపర చర్యలుంటాయని హెచ్చరించిన సందర్భాలు మనం చూశాము కూడా..