మాజీ మంత్రి కేటీఆర్ మాస్ వార్నింగ్..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు.. నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీస్ అధికారులను ఉద్ధేశిస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ముఖ్యమంత్రి .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్ధేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్త.. సోషల్ మీడియా వారీయర్ నర్సింగ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై పోలీసులు కేసులు పెట్టారు. అక్కడితో ఆగకుండా స్టేషన్ కు పిలిపించుకోని మరి ఎవరికో వీడియో కాల్ చేసి మరి కొట్టారని బీఆర్ఎస్ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో నర్సింగ్ ను మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు కలిశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ” అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పోలీసులు రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలా పని చేస్తుంది. మేము అధికారంలోకి వచ్చాక ఎవర్ని వదిలిపెట్టము. రామయంపేట సీఐ.. ఎస్ ఐ లు ఎక్కడున్న వదిలిపెట్టము. చట్టం ప్రకారం వాళ్లపై చర్యలుంటాయని హెచ్చారించారు.
