దీపావళి బాంబులు పేలాయి.! పొంగులేటి బాంబులే తుస్సు..తుస్సు..!
దీపావళి పండుగకు కాళేశ్వరం, ధరణి,ఫోన్ ట్యాపింగ్ లాంటి మరికొన్ని బాంబులు పేలుతాయి. బీఆర్ఎస్ కు చెందిన అగ్రనేతలందరూ ఒకరి తర్వాత ఒకరూ అరెస్ట్ అవుతారు.. పదేండ్ల బీఆర్ఎస్ అవినీతి పాలనపై అనేక బాంబులను సిద్ధం చేసినట్లు సౌత్ కొరియో పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు.
అయితే దీపావళికి తెలంగాణలో గల్లీ నుండి హైదరాబాద్ లో ప్రతి బజార్లో దీపావళి బాంబులు పేలాయి. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన బాంబులే తుస్సుమన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి.. హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఆ పార్టీకి చెందిన నేతలు ఇలా అవాక్కులు చవాక్కులు పేలుస్తున్నారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి డైవర్శన్ పాలిటిక్స్ తప్పా ప్రజలకిచ్చిన హమీలల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.మూసీ నది ప్రక్షాళన,హైడ్రా ఇలాంటి చర్యలన్నీ హామీలను తుంగలో తొక్కడానికి మాత్రమే అని వారు వాదిస్తున్నారు. దీపావళి కి ప్రపంచం బద్ధలవుతుంది.. లోకమే ఆగమవుతుందన్న స్థాయిలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. తీరా పండుగకు బజార్లో బాంబులు పేలాయి తప్పా కాంగ్రెస్ పేలుస్తున్న అన్న మంత్రి పొంగులేటి బాంబులు తుస్సుమన్నాయి అని వారు హేద్దేవా చేస్తున్నారు.