తెలంగాణలో ఇక TS ఉండదా..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వాహానాల రిజిస్ట్రేషన్ కోసం టీఎస్ గా తెలంగాణ స్టేట్ ను తీసుకోచ్చిన సంగతి తెల్సిందే..
తాజాగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీను తీసుకోచ్చింది. దీంతో ఇకపై రిజిస్ట్రేషన్ చేయించుకోనున్న వాహనాలన్నింటికి టీఎస్ స్థానంలో టీజీ రానున్నది.
అయితే ఇప్పటికే ఉన్న టీఎస్ లో ఎలాంటి మార్పులు ఉండవు..ఈ జీవో అమలు వచ్చిన నాటి నుండి మాత్రమే టీజీ అని వాహానాల రిజిస్ట్రేషన్ లో కన్పిస్తుంది.