టీడీపీ కి వైసీపీ కౌంటర్
ఏపీ అధికార టీడీపీ కి ఎక్స్ వేదికగా ప్రతిపక్ష వైసీపీ కౌంటర్ ఇచ్చింది. మొత్తం పద్నాలుగు ఏండ్లు పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్క రోజు అయిన ఇంటికెళ్లి ఆసరా పింఛన్ ను లబ్దిదారులకు అందజేశారా అని ఆ పార్టీ అధికారక ట్విట్టర్ ఖాతాలో రేపటి నుండి మొదలు కానున్న ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సందర్బంగా చంద్రబాబు ఇంటికెళ్లి ఇవ్వనున్న నేపథ్యంలో కౌంటర్ పోస్ట్ చేసింది..
ఇంకా ట్విట్టర్ లో ‘అవ్వాతాతలను ఏడిపించింది ఎవరో అందరికీ తెలుసు. జగనన్న హయాంలో పండుటాకులకు కష్టం కలగకుండా గడప వద్దే పింఛను అందించాము .
14ఏళ్లలో ఒక్క రోజైనా ఇంటి వద్దకే చంద్రబాబు పింఛను పంపించారా? పింఛనుదారులకు డబ్బు ఎగ్గొట్టడానికేగా ఈ డప్పు ప్రచారం!’ అని Xలో వైసీపీ మండిపడింది.