రూ.1000లతో బాబు కట్టుకున్న పూరి గుడిసె ఇదే..?
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయడి నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు కట్టింది..
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నేతృత్వంలోని వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ప్యాలెస్లు నిర్మించుకున్నారని టీడీపీ ఎక్స్ వేదికగా విమర్శించింది.
దీనికి వైసీపీ Xలో రివర్స్ కౌంటరిచ్చింది. ‘రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.1,000కి లీజుకి తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కట్టుకున్న పూరి గుడిసె ఇదే!
ఈ స్థలం 99ఏళ్లు టీడీపీకే సొంతం అనేలా చట్టవిరుద్ధంగా రాయించుకున్నారు. ఇలాంటి భూములు ప్రతి జిల్లాలో కాజేశారు’ అని ఎక్స్ వేదికగా వైసీపీ ఆరోపించింది.