కేటీఆర్, హారీశ్ రావుల మధ్య ఆ విషయంలో పోటీ పక్కా..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హారీష్ రావుల మధ్య ఇటు రాజకీయంగా అటు పదవుల పరంగా పోటీ ఉంటుంది అనేది అందరికి తెల్సిందే. అఖరికి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పుడప్పుడే కాదు మీడియాతో మాట్లాడిన ప్రతిసారి హారీష్ రావు, కేటీఆర్ లు ఇటు పార్టీలో పదవుల కోసం.. అటు ముఖ్యమంత్రి పీఠం గురించి గొడవలు పడుతుంటారని ఆరోపిస్తారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హారీష్ రావు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” కేటీఆర్ నేను పదవుల కోసమో.. పార్టీకోసమో గొడవపడము.. పోటీపడము.. తెలంగాణ రాష్ట్రానికి శనేశ్వరం మాదిరి పట్టిన నిన్ను గద్దె దించడానికి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించడానికి పోటీ పడతాము .
. కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసేదాక చేసే పోరాటంలో పోటీ పడతాము.. మీరు ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలు.. నాలుగోందల ఇరవై హామీలను అమలు చేసేదాక చేసే ఉద్యమంలో మేమిద్దరం పోటి పడతాము అని క్లారిటీచ్చారు.
