సంచులతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి.. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల వార్ తారాస్థాయికి చేరుతుంది. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు సహచర ఎమ్మెల్యేలను కొనబోయి నారా చంద్రుడు పంపిన నోట్ల సంచులతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి.
ఏమి తప్పు చేయనప్పుడు ఎందుకు అంతలా ఊగిపోతున్నారు.. ముమ్మాటికి మా కేసీఆర్ హారిశ్చంద్రుడే.. అందుకే పద్నాలుగేండ్లు తెలంగాణ కోసం కోట్లాడి రాష్ట్రాన్ని సాధించి పదేండ్లలో అభివృద్ధి పథంలో నడిపించారు.. దమ్ముంటే మా పార్టీపై చేస్తున్న అసత్య ఆరోపణలపై… నాపై చేసిన వ్యాఖ్యలపై హౌజ్ కమిటీ వేసి నిరూపించాలి” అని సవాల్ విసిరారు.