రేవంత్ రెడ్డి భయంతో తగ్గిన ఆదాయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తీసుకోచ్చిన బుల్డోజర్ సంస్కృతితో ప్రజల్లో వెలకట్టలేనంత భయం కలిగింది. దీనివల్ల హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ భూమ్ పడిపోయింది. జరగాల్సిన జరిగే రిజిస్ట్రేషన్లు తగ్గాయి..
దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిందని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పదేండ్లలో హైదరాబాద్ లో ఆదాయం లక్ష కోట్లకు చేరింది.. కాంగ్రెస్ పది నెలల పాలనలో అది వేల కోట్లకు దిగజారింది. హైడ్రా హైరానాతో రెండు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్, రిజిస్ట్రేషన్లు పడిపోయింది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు..కొత్తగా ఆదాయం సృష్టించకపోయినా ఉన్నది ఊడగొడుతూ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఫోర్‌బ్రదర్ సిటీపై ఫోకస్ చేసి అక్కడ కృత్రిమ రియల్ బూమ్‌కోసం ఆలోచిస్తున్నారని, సామాన్యుల ద్వారా కొనుగోలు, అమ్మకాలు లేకుంటే ఆదాయం ఎలా పెరుగుతుంది. హైడ్రాతో ప్రజల్లో తీవ్ర భయాంకర పరిస్థితులను నెలకొల్పారు. మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు.. అది పని చేసే విధానానికే వ్యతిరేకం అని మరోసారి తేల్చి చెప్పారు.