పదినెలలు ఓపిక పట్టలేరా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. పెద్దపల్లి సభలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా? అని ప్రశ్నించారు. ‘ది
గిపో.. దిగిపో అని కేసీఆర్, హరీశ్, కేటీఆర్ అంటున్నారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు. పది నెలలు ఓపిక పట్టలేరా? పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా? అని కౌంటర్ ఇచ్చారు.
ప్రభుత్వం ఏ పని చేయాలన్నా విధివిధానాలు ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి సహేతుక సలహాలు ఇచ్చారు’ అని సీఎం వ్యాఖ్యానించారు.