కేటీఆర్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగ సవాల్

KTR Former Minister Of Telangana
3 total views , 1 views today
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 8,888 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు అని అసత్యప్రచారం చేస్తున్నారు..
ముఖ్యమంత్రి కుంభకోణానికి పాల్పడ్డారు అని నిరూపించాలి.. నిరూపిస్తే నేను నా పదవులకు రాజీనామా చేస్తాను.. నిరూపించకపొతే కేటీఆర్ తన పదవులకు రాజీనామా చేస్తారా..? అని ఆయన మాజీ మంత్రి కేటీఆర్ కు బహిరంగ సవాల్ విసిరారు.
ఇంకా మాట్లాడుతూ ” మాజీ కేటీఆర్ పై పరువు నష్టదావా వేస్తాము.. లీగల్ గా మేము కోట్లాడుతాము.. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ పేరుతో ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయల స్కాం చేశారు అని ఆయన అన్నారు.
