గవర్నర్ గా KCR.. కేంద్ర మంత్రిగా KTR..

KCR’s key meeting with BRS leaders today..!
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గవర్నర్… మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రిగా కేటీఆర్ … అసెంబ్లీ అపోజిషన్ లీడర్ గా హారీష్ రావు అవ్వడం ఖాయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ” బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వడం ఖాయం.. ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు.. బీఆర్ఎస్ పార్లమెంటరీ బీజేపీలో విలీనమవుతుంది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుంది.. ఎమ్మెల్సీగా ఉన్న కవితకు రాజ్యసభ ఇస్తారు.. లిక్కర్ కేసు పక్కకు వెళ్తుంది.
బీఆర్ఎస్ఎల్పీ బీజేఎల్పీలో విలీనమవుతుంది. అప్పుడు మాజీ మంత్రి హారీష్ రావు అసెంబ్లీలో బీజేపీ తరపున అపోజిషన్ లీడర్ అవుతారు. బీఆర్ఎస్ పని అయిపోయింది. అందుకే ప్రజలు ఎంపీ ఎన్నికల్లో జీరో ఇచ్చారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
