అప్పుడే కేసీఆర్ ఎంట్రీ…?
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ గులాబీ దళపతి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే.. ఆ తర్వాత మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అఖరి రోజు హాజరయ్యారు. ఆ తర్వాత ఇటు మీడియాలో కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ కన్పించలేదు.
అఖరికి భారీ వర్షాలతో ఎదురైన వరదలకు ఖమ్మం అతలాకుతలమైన కానీ కేసీఆర్ స్పందించలేదు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ కేసీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇదే అంశం గురించి #ASKKTR లో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానమిచ్చారు. ఓ నెటిజన్ మళ్లీ కేసీఆర్ ఎప్పుడు ప్రజల్లోకి వస్తారు అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కు కేటీఆర్ బదులిస్తూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని కేసీఆర్ భావించారు. ఈ ఏడాది డిసెంబర్ నెలతో ఏడాది పూర్తవుతుంది. వచ్చేడాది 2025లో కేసీఆర్ జనంలోకి వస్తారు. ప్రభుత్వ వైపల్యాలపై.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు నాలుగోందల ఇరవై హామీలపై నిలదీస్తారు అని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.