రోజా పని అయిపోయిందా…?
రోజా అంటే ఓ ఫైర్ బ్రాండ్.. రోజూ ఏదోక వార్తతో నిత్యం మీడియాలో హాల్ చల్ చేసే ఓ మంత్రి.. పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చంద్రబాబు నాయుడు వరకు ఏ ఒక్క నాయకుడ్ని వదలకుండా ఒకపక్క బూతుపురాణంతో మరోపక్క తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడే వైసీపీ మహిళ నాయకురాలు. అలాంటి నాయకురాలు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు.. వార్తల్లోనే లేకుండా పోయారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ తన ఓటమికి కారణం వైసీపీకి చెందిన కొంతమంది నేతలు టీడీపీకి అమ్ముడుపోయారు.
టీడీపీ అభ్యర్థి గెలుపుకోసం లోపాయికారిగా పని చేశారు అని కన్నీటిపర్యాంతం అవుతూ మాట్లాడటం తర్వాత ఆమె అసలు మీడియాకు అందుబాటులోనే లేకుండా ఉన్నరు. నిన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో మళ్లీ దర్శనమిచ్చారు.. ఓ తార తళుక్కుమన్నట్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి ఆర్కే రోజా సైలెంట్ అయిపోయారని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు.
అధికారంలో ఉన్న సమయంలో నోటికి ఏదిపడితే అది మాట్లాడీ వైసీపీ ఓటమికి ఓ రకంగా కారణమయ్యారని ఆ పార్టీ నేతలే అధినేత జగన్ కు పిర్యాదులు చేసిన నేపథ్యంలో ఆయన రోజాను పక్కన పెట్టారని టాక్. అందుకే ఈవీఎంలను లైవ్ లో పగలకొట్టి టీడీపీ నేతలపై దాడులకు దిగిన మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డిని జైల్లో పరామర్శించడానికి వెళ్ళిన వైఎస్ జగన్ అండ్ బ్యాచ్ రోజాను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న కానీ స్పందించకపోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది.
తనకు ఏది చెబితే అది చేసిన.. ఇప్పుడు పార్టీ తనను పట్టించుకోకపోవడంతో తన వారివద్ద వాపోతుందంట మాజీ మంత్రి ఆర్కే రోజా.. చూడాలి మరి మున్ముందు ఏమైన ఇంతకుముందు రోజాను చూస్తామేమో అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.