బీఆర్ఎస్ ప్రతిపక్షమా.?. అధికార పక్షమా..?

 బీఆర్ఎస్ ప్రతిపక్షమా.?. అధికార పక్షమా..?

BRS Former MLA

అదేంటి గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు అప్పటి అధికార బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. గత పది నెలలుగా ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ఏంటి బీఆర్ఎస్ ప్రతిపక్షమా.. ?. అధికార పక్షమా .? అని టైటిల్ పెట్టారని ఆలోచిస్తున్నారా..?. గత పది నెలలుగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీకి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణలను చూస్తుంటే ఈ అనుమానం రాకమానదు. ప్రజలకు నచ్చలేదు కాబట్టే బీఆర్ఎస్ ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.

కాంగ్రెస్ ను అధికార పక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్షంగా మొదటి రోజు నుండే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తుంది. అడుగడుగున వీలు చిక్కినప్పుడల్లా ప్రశ్నిస్తూనే ఉంది. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిందో లేదో కానీ మరుక్షణమే బీజేపీకి చెందిన సీనియర్ నేత. కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా ముందుకు వస్తారు . పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆగం చేసింది. ప్రజల జీవితాలతో ఆడుకుంది అని అంటారు తప్పా కాంగ్రెస్ పార్టీ హామీలను ఎందుకు అమలు చేయలేదు అని పల్లెత్తి మాట అనరు.

కనీసం కేంద్ర మంత్రిగా అయిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పది నెలలైన హోం మంత్రిని ఎందుకు నియమించలేదు అని ప్రశ్నించరు.. అదే బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావులు మీడియా ముందుకు వస్తే చాలు తోక కాలిన పిల్లిలా మీడియా ముందుకు వస్తారు అవినీతి.. అక్రమాలు అంటాడు. వెళ్ళిపోతారు. దాంతో అప్పటివరకు బీఆర్ఎస్ లెవనెత్తిన ప్రశ్నలు.. చేసిన డిమాండ్లను మీడియా పక్కకు పెట్టి బండి సంజయ్ వ్యాఖ్యలపై డిబెట్లు పెడతాయి.. ఎఫిసోడ్ లు ఎఫిసోడ్ లు రన్ చేస్తాయి. ఒకరోజు బండి సంజయ్.. ఇంకో రోజు కిషన్ రెడ్డి. ఒక గంట ఎంపీ.. ఇంకో గంట ఎమ్మెల్యే అని ఇలా విడతల వారీగా మీడియా ముందుకు వచ్చి బీఆర్ఎస్ పైనే విమర్శలు చేస్తారు ..

ఆరోపణలు చేస్తారు తప్ప కాంగ్రెస్ ను ఒక్క మాట కూడా అనరు.. అనకపోగ బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన్న కానీ బండి సంజయ్ రేవంత్ రెడ్డికి మద్ధతుగా బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరుగుతారు.దీన్ని బట్టి కేంద్ర హోం మంత్రి గా ఉన్న(సహాయక) బండి సంజయ్ బీఆర్ఎస్ ను ఇంకా అధికార పక్షంగా చూస్తా ఉన్నారు అని రాజకీయ వర్గాలు.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *