జైలుకెళ్తే కేటీఆర్ సీఎం…?
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలపై అవినీతి ఆరోపణలు చేయడం.. అక్రమ కేసులు పెట్టి వేధించడమే పనిగా పెట్టుకుంది. తాజాగా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసింగ్ గురించి యాబై ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. మరోవైపు రెండు మూడు రోజుల్లో కేటీఆర్ ఆరెస్ట్ కావడం ఖాయం.. అందుకే విదేశాలకెళ్లాడని ఇటు కాంగ్రెస్ శ్రేణులు.. అటు కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా కథనాలను ప్రచురిస్తుంది. కాసేపు ఫార్ములా ఈ రేసింగ్ లో అవినీతి జరిగిందా…?. అక్రమాలు చోటు చేసుకున్నాయా ..? అసలు కేటీఆర్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడా ..? ఆ యాబై ఐదు కోట్లు చేతులు మారాయా అని కాలం సమాధానం చెబుతుంది.
ఇప్పుడు గత ఉమ్మడి ఏపీ చరిత్ర తీసుకున్న పక్కనున్న తమిళనాడు చరిత్ర తీసుకున్న అఖరికి దేశ చరిత్ర తీసుకున్న కానీ జైలుకెళ్లి వచ్చినవాళ్ళంతా రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రాలను పాలించారు. అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన కాంగ్రెస్ కలిసి(వైసీపీ ఆరోపణ) జగన్ ను అక్రమ కేసులతో అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు.. ఆ తర్వాత విభజన తర్వాత రెండో ముఖ్యమంత్రిగా (ఏపీకి) ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జగన్ పాలనపై దృష్టి పెట్టకుండా.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు & టీమ్ ను అక్రమ కేసులతో వేధిస్తే చివరికి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా మెజార్టీ స్థానాలను గెలుపొంది సీఎం అయ్యారు.
ఎక్కడదాకో ఎందుకో మన తెలంగాణ నే తీసుకుంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాడని ప్రస్తుత ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అలా జైలుకెళ్లిన రేవంత్ రెడ్డి తాజాగా కేటీఆర్ విషయంలో దూకుడుగా ప్రవర్తించడం కేటీఆర్ సీఎం కావాలనే కంటున్న కలలు నిజం కావడానికి బీజం పడబోతుంది అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు కావాల్సింది ప్రతిపక్ష పార్టీ నేతల అవినీతి అక్రమాల చిట్టా బయటకు తీయడమో లేదా వాళ్లని అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడమో కాదు..
గత ఎన్నికల్లో ఏమి చెప్పారో వాటిని అమలు చేయడం.. సంక్షేమాభివృద్ధిని అందించడం. అలా కాకుండా అధికారాన్ని వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు కీలకం.. ఆ ఓటరే రాజకీయ పార్టీల.. నేతల తలరాతలను నిర్ణయిస్తారు. ఇప్పటికైన సరే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకొక్కటి అమలు చేస్తూ ప్రజల మన్నలను పొందాలి తప్పా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి.. ఆ పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం అని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నారు.