జీవో29 (GO 29) లాభమా..?. నష్టమా..? .ఎవరికి..?
సోమవారం నుండి తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాము అని సీఎస్ ప్రకటించారు. ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశామని కూడా తెలిపారు. అయితే జీవో 29 ను రద్ధు చేయాల్సింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన జీవో 55 (GO 55) ప్రకారమే నిర్వహించాలని గ్రూప్ – 1 అభ్యర్థుల ప్రధాన డిమాండ్. అభ్యర్థుల దగ్గర నుండి కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ వరకు అందరూ ధర్నాలకు రాస్తోరోకులకు దిగారు.. మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావుల అయితే ఏకంగా ఆ జీవో వల్ల లాభనష్టాల గురించి తమదైన శైలీలో వివరిస్తున్నారు. అసలు ఈ జీవో 29 లాభమా.. ?. నష్టమా..?. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే అంశం గురించి ఇప్పుడు చర్చిద్దాము.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోచ్చిన జీవో 55 ప్రకారం 1:50 నిష్పత్తిలో మొదటి యాబై ఉద్యోగాలను భర్తీ మెరిట్ ప్రకారం చేస్తారు.. ఈ విధంగా దాదాపు నలబై శాతం వరకు అభ్యర్థులను వాళ్లు ఎస్సీలైన.. బీసీలైన.. ఓసీలైన.. ఎస్టీలైన సరే ఎంపిక చేస్తారు. మిగతా అరవై శాతం మాత్రం ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ప్రకారం సెలెక్ట్ చేస్తారు. దీంతో ఇటు ఓపెన్ కేటగిరీ.. అటు రిజర్వేషన్ కేటగిరీలో ఎవరికి న్యాయంగా దక్కాల్సినవి వాళ్లకు దక్కుతాయి. అందుకే గ్రూప్ -1 అభ్యర్థులు జీవో 55 ప్రకారం పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ జీవో 29 ప్రకారం కేవలం మెరిట్ ప్రకారమే సెలెక్ట్ చేస్తారు.
ఎలా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన జీవో 29ప్రకారం మొదటి యాబై ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటే ఇందులో ఒకవేళ ఎస్సీ వాళ్లైన బీసీ వాళ్లైన ఎస్టీ వాళ్లైన ఓ పది మందో లేదా ఓ ఐదుగురో ఎంపికయ్యారనుకుందాం.. ఆ తర్వాత రిజర్వేషన్ ప్రకారం ఆయా వర్గాల రిజర్వేషన్లో ఎంపిక కావాల్సిన వాళ్లు ఊదాహరణకు ఓ పదహారు మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఆయా అభ్యర్థులు అనుకుందాం.. ఇందులో మొదట యాబై మందిలో ఐదుగురో .. పదిమందో ఎంపికయ్యారు కాబట్టి రిజర్వేషన్ కేటగిరీలో ఎంపిక కావాల్సినవాళ్లు కేవల పదకొండు మందో.. ఆరుగురో అని నిర్ణయిస్తారన్నమాట..
దీనివల్ల రిజర్వేషన్ కేటగిరి వాళ్లకు అన్యాయం జరుగుతుంది అన్నమాట. అందుకే జీవో 29వద్దు.. జీవో 55ప్రకారం పరీక్షలను నిర్వహించాలని వాళ్ల డిమాండ్. ఒక్క గ్రూప్ – 1 కాదు గ్రూప్ -2, గ్రూప్ -4 కూడా ఇదే వర్తిస్తుందని వారి ఆవేదన అన్నమాట..ఇంకా క్లియర్ గా ఆర్ధమవ్వాలంటే కింద మాజీ మంత్రి హారీష్ రావు స్పష్టంగా వివరించారు.. మీరు ఓ లుక్ వేయండి..?