సమ్మక్క సారలమ్మ చరిత్రలోనే తొలిసారి…?
ఆదివాసీ గిరిజన బిడ్డల ఆరాధ్య దైవంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల చరిత్రలోనే తొలిసారిగా మేడారంలోని అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్లు పూజార్లు ప్రకటించారు.
తమ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్టు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు.
వరంగల్లోని మేడా రం సమ్మక్క, సారలమ్మ కార్యాలయాన్ని ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రకాళి దేవస్థాన పూజారులు మం త్రులు, ఎమ్మెల్యేల ద్వారా దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని వారు ఈ సందర్భంగా ఆరోపించారు ..